కార్తీకమాసంలో వచ్చే నాగుల చవితి రోజు నాగదేవతను ఎలా పూజించాలి

నవంబర్ 2వ తేది నుండి కార్తీక మాసం ప్రారంభం అయింది. నవంబర్ 5వ తేదిన అనగా మంగళవారం నాడు నాగుల చవతి వస్తుంది. మంగళవారంతో కలిసోచ్చే నాగుల చవితి చాలా శక్తివంతమైనది అని చెప్పచ్చు. ఈ కార్తీకమాసంలో వచ్చే నాగుల చివితి రోజున నాగదేవతను ఎలా పూజించాలి, పుట్ట పూజ ఎలా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఎంటో తెలుసుకుందాం.

How to perform pooja on nagulachavath

ప్రతీకాత్మిక చిత్రం

నవంబర్ 2వ తేది నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. నవంబర్ 5వ తేదీన అనగా మంగళవారం నాడు నాగుల చవతి వస్తుంది. మంగళవారంతో కలిసోచ్చే నాగుల చవితి చాలా శక్తివంతమైనది అని చెప్పవచ్చు. ఈ కార్తీకమాసంలో వచ్చే నాగుల చివితి రోజున నాగదేవతను ఎలా పూజించాలి? పుట్ట పూజ ఎలా చేయాలి? పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే నాగులచవితి రోజున నాగదేవతను పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలిగిపోతాయి. ఈ నాగుల చవితి నాడు నాగదేవతో పాటు శివుడిని పూజిస్తే మీ ఇంట్లో ధన, ధాన్యాలకు లోటుండదు, శివుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది.

పూజా విధానం:

నాగులచవితి రోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఈ పూజ చేసేవాళ్లు ఎరుపు రంగు దస్తులను ధరించాలి. శివపార్వతుల చిత్రపటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో పూజ చేపుకున్న తర్వాతే పుట్ట దగ్గరకు వెళ్లి నాగదేవతను పూజించాలి. చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలు తొలిగిపోతాయి. ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

పూజకు కావలసినవి:

ఆవు పాలు, ఎర్రటి పుష్పాలు, పసుపు కుంకుమ, అక్షింతలు, కొబ్బరికాయ, అగరవత్తులు

నైవేద్యం:

నాగదేవతకు నైవేద్యంగా చలిమిడిని తయారుచేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టాలి. అలాగే అరటి పండు, వడపప్పు గారెలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్