Hanuman | ఆంజనేయస్వామి ఎన్ని అవతారాలు ఎత్తాడో తెలుసా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ఆంజనేయస్వామి ఎన్ని అవతారాలు ఎత్తాడో తెలుసా||

ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. జై హనుమాన్.. ఈ పేరు వింటే ఏదో తెలియని ధైర్యం. చిన్న పిల్లల మెడలో ఆంజనేయ స్వామి లాకెట్ ఉంటే, ఎల్లవేళలా ఆ స్వామి పిల్లలకు అండగా ఉంటాడన్న భరోసా. రామనామం జపిస్తే చాలు.. ఎలాంటి ఆపద నుంచైనా గట్టెక్కిస్తాడన్న నమ్మకం. భయాన్ని పోగొట్టాలన్నా, పీడ బాధలు పోవాలన్నా ఆంజనేయస్వామి దండకం చదివితే చాలు అన్నీ పటాపంచలు అయిపోతాయన్న ప్రగాఢ విశ్వాసం. అయితే, ఆంజనేయస్వామి కూడా విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారం ఎత్తితే, ఆంజనేయస్వామి తొమ్మిది అవతారాలు ధరించారు. అవేంటంటే..

1. ప్రసన్నాంజనేయస్వామి

2. వీరాంజనేయస్వామి

3. వింశతిభుజ ఆంజనేయస్వామి

4. పంచముఖ ఆంజనేయస్వామి

5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి

6. సువర్చలాంజనేయస్వామి

7. చతుర్భుజ ఆంజనేయస్వామి

8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి

9. వానరాకార ఆంజనేయస్వామి

ఆంజనేయస్వామికి ఇష్టమైనవి ఏంటంటే..

తమలపాకుల దండ, మల్లెలు, పారిజాతాలు, తులసి, కలువలు

వెబ్ స్టోరీస్