|| ప్రతీకాత్మక చిత్రం ||
మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. అయితే ఫిబ్రవరి 5వ తేదీన మాఘ మాస పౌర్ణమి అలాగే రవి పుష్పయోగం ఏర్పడుతుంది. సూర్యభగవానునికి ఇష్టమైన మాసంలో ఆదివారం పౌర్ణమి ఏర్పడటం చాలా విశిష్టత ఉంటుంది. మాఘ మాస పౌర్ణమి ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 9.29 నిమిషములకు మొదలై ఫిబ్రవరి 5వ తేదీన రాత్రి 11:58 నిమిషములకు పూర్తవుతుంది. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 7.07 గంటల నుండి పగలు 12.13 వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడిని మహాలక్ష్మి పూజిస్తే మంచి సంపద శ్రేయస్సు సిద్ధిస్తాయని శాస్త్రాలు తెలుపుతున్నాయి.
అలాగే ఈరోజు దానధర్మాలు చేయడం వల్ల ఇంట్లో అంతా మంచి జరుగుతుందాని నమ్మకం. ఈరోజు పేదవారికి అనాధలకు దానం చేయడం వల్ల కుటుంబంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది. బట్టలు, పుస్తకాలు, డబ్బులు దానం చేయుట వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం. ఈరోజు నది స్నానం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించడం వల్ల కోరిన కోరికలు తీరి, మోక్షం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.