దేవుడిని పూజించే సమయంలో పువ్వులు అర్పిస్తుంటాం. అయితే, ఒక్కో దేవుడికి ఒక్కో రకం పూలు అర్పిస్తే గొప్ప ఫలితాలు అందుతాయని పురాణాలు చెప్తున్నాయి. వాటి ఫలితాలను పరిశీలిస్తే..
ప్రతీకాత్మక చిత్రం
దేవుడిని పూజించే సమయంలో పువ్వులు అర్పిస్తుంటాం. అయితే, ఒక్కో దేవుడికి ఒక్కో రకం పూలు అర్పిస్తే గొప్ప ఫలితాలు అందుతాయని పురాణాలు చెప్తున్నాయి. వాటి ఫలితాలను పరిశీలిస్తే.. జాజి పువ్వులతో అర్చిస్తే భుక్తి, ముక్తి కలుగుతుంది. చంపకము, స్తంభనము, మొగలి, మొల్ల, తెల్ల కలువ ఉచ్ఛాటన పద్ధతిలో ఆయుధముగా పనిచేస్తుంది. బంగారు మల్లెలు లాభం, నల్ల గోరింట పువ్వుల అర్చన బలవర్ధనము, తెల్ల కలిగొట్టు గొప్ప కీర్తిని ఇచ్చును. పద్మము శాంతి, పుష్టిని ఇచ్చును. కమలము సుపుత్రులను, దాసాని, రక్తగన్నేరు వశీకరణము ఇచ్చును. శాలి (వరివెన్ను) సౌభాగ్యమును, కడిమి, పొగడ, మొల్ల, వస, కుందము పుష్పములతో అర్చించిన పాపనాశనం చేయును. కుసుము వశీకరణము, మోదుగ ఆకర్షణము, పొన్న, నాగకేసరాలు మహలక్ష్మీ ప్రదం. ఎర్ర కలువ వశీకరణం, నీలము, నల్ల కలువలు మారణ ప్రయోగము నందు, మందార పుష్పము శత్రువుకు భయము కలిగించుటకు ఉపయోగించదగినది.
వైశాఖ మాసంలో నంవుపొగడ పువ్వులు, జేష్ట్య మాసంతో నాగకేసర పుష్పములు, ఆషాడమున గన్నేరు పుష్పములు విరివిగా దొరకును కావున దేవతార్చనకు ఈ మాసములో వీటిని వాడుట శ్రేష్టం. శ్రావణ మాసంలో పద్మముల కన్నా సంపెంగలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. భాద్రపదమున లొద్దుగ, అశ్వజమమున దాసాని, కార్తీకములో అగిసే, మార్గశిరమున బిల్వములు, పుష్యమాసము నందు కుంద పుష్పములు, ఫాల్టుణమున పూల గురివిందతో పూజించుట సర్వసిద్ధి ప్రదాయకము చైత్రమాసమున అశోక మొగ్గలతో పూజించుట అత్యంత శ్రేష్టదాయకం. తెల్లని సన్నజాజి, అడవి గోరింట, దవనం, రేల, పచ్చపూల గోరింట, ఎర్ర గోరింట, కలిగొట్టు, విరజాజి, జిల్లేడు, మాధవి, గొరింటా ఈ 11 రకాల పుష్పములతో జగదాంబకు అర్చన కొరకు సమర్పించవలెను.
సన్నజాజి పుష్నములతో పూజింజిన వాక్‌శుద్ధి కలుగుతుంది. చమేలీ పుష్పాములతో అర్చించిన రాజవశీకరణము కలుగును. అధిక మేధాశక్తి లభించును. నాగకేసరములు రాజత్వమును ప్రసాదించును. సూల గురవింద భూలాభము, సంపెగ బంగారము, బండి గురువెంద బుద్ధివృద్ధి, మల్లె ధనాధిక్యతను కలిగించును. మొల్ల పువ్వు కీర్తని, దాసాని పువ్వులతో అర్చించిన శత్రవులు సంశయావస్థలో పడెదరు. పద్మము వల్ల ఆయుర్వృద్ధి కలుగును. కలువ వలన కవిత్వము అబ్బును, కడిమి పుష్పములతో అర్చన ద్వారా వ్యాధి నాశనము, బ్రహ్మదండి వల్ల బుద్ధిశాలిత్వము సంభవించును. మరువము వల్ల విజయపాప్తి, పచ్చ గోరింట వల్ల గజలాభము, అపరాజితా పుష్పముల వల్ల సర్వాంగ సుందరత్వము అబ్బును.వావిలి వల్ల పుత్రలాభము, అశోకము వల్ల దుఃఖరాహిత్యము, పొగడ వల్ల వంశ గౌరవము కలుగును.