Ganesha Mantra: ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయా?వినాయకుడి ఈ మంత్రాలు చదవండి

మన జీవితానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే ప్రత్యేక శక్తి వినాయకుడికి ఉంది. గణపతి మంత్రాలను పఠించడం వల్ల జీవితం ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది.వినాయకుడికి సంబంధించిన ఏ మంత్రాలను జపించాలి? తెలుసుకుందాం.

Ganesha Mantra

ప్రతీకాత్మక చిత్రం

వినాయకుడిని ఆరాధిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టిన కార్యం పూర్తవుతుందని చాలా మంది నమ్ముతుంటారు. అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. బుధవారం గణపతిని పూజించడానికి ఉత్తమమైన రోజు. ఈ రోజున గణపతి పూజ, ఉపవాసం, మంత్రాలను పఠించడం ద్వారా గణేశుడి ఆశీస్సులను పొందవచ్చని చెబుతుంటారు. బుధవారం గణపతి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. అంతేకాదు  గ్రహదోషాలు తొలగిపోతాయి. బుధవారం ఏ గణేశ మంత్రాలను జపించాలి? ఈ మంత్రాల వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. 

పనిలో అడ్డంకులను తొలగించే మంత్రం:

"ఓం గన్ గణపత్యే సర్వకార్య సిద్ధి కురు కురు స్వాహా"

ఈ మంత్రం గణేశుడికి సంబంధించిన  సులభమైన, ప్రభావవంతమైన మంత్రం. స్వచ్ఛమైన మనస్సుతో, భక్తితో ఈ మంత్రాన్ని పఠిస్తే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం.

పూజకు ముందు ఈ మంత్రాన్ని పఠించండి:

"గజాననాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి, తన్నో దంతి ప్రచోదయాత్"

శ్రీ వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ-కార్యేషు సర్వదా''

తూర్పు ముఖంగా కూర్చుని ఈ మంత్రాన్ని 7 నుండి 21 సార్లు జపించండి. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే, హవన, పూజ, హారతి ముందు ఈ మంత్రాన్ని పఠించడం మంచిది.

కోరిక నెరవేర్చే మంత్రం:

"ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్" అనే ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా గణేశుడు ప్రసన్నుడై భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడు. ఎవరికైనా తీరని కోరిక ఉంటే, అది నెరవేరడానికి ఈ గణేశ మంత్రాన్ని జపించాలి.

విశ్వాస మంత్రం:

"మహాకర్ణాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి, తన్నో దంతి ప్రచోదయాత్|

గజాననాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి, తన్నో దంతి ప్రచోదయాత్||''

ఈ మంత్రాన్ని నిర్దేశిత సార్లు, అంటే 1 నుండి 10 జపమాల పూర్తయ్యే వరకు జపించవచ్చు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనిషిలో కొత్త విశ్వాసం కలుగుతుంది.

వివాహ సమస్యల నుండి బయటపడటానికి మంత్రం:

'ఓం వక్రతుండైక్ దంష్ట్రాయ

క్లీం హ్రీం శ్రీం గం గణపతే

వర వరద సర్వజనం మే వశమానాయ స్వాహా'

అనే మంత్రాన్ని పఠించడం ద్వారా వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి . ఎవరైనా వివాహ విషయాలలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, వారు ఈ మంత్రాన్ని పఠించాలి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్