హిందువుల పండగలలో విజయ దశమి ఎంతో ప్రత్యేకమైన పండగ. విజయ దశమి ముందు తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు అంటారు. ఈ తొమ్మిది రోజులు దేవిని అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకారం చేసి పూజిస్తారు. అంతేకాకుండా తొమ్మిది రోజుల్లో ఒక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.
ప్రతీకాత్మక చిత్రం
హిందువుల పండగలలో విజయ దశమి ఎంతో ప్రత్యేకమైన పండగ. విజయ దశమి ముందు తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు అంటారు. ఈ తొమ్మిది రోజులు దేవిని అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకారం చేసి పూజిస్తారు. అంతేకాకుండా తొమ్మిది రోజుల్లో ఒక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.
మొదటి రోజు: ఈ రోజు అమ్మవారు బాలత్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు కట్టెపొంగలి సమర్పిస్తారు. ఈ రోజు అమ్మవారికి కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు.
రెండవ రోజు: ఈ రోజు అమ్మవారు గాయత్రిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ రోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. నైవేధ్యంగా పులిహోర నివేదిస్తారు.
మూడవ రోజు: ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారికి నైవేధ్యంగా కొబ్బరి అన్నం సమర్పిస్తారు.
నాలుగోవ రోజు: ఈ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పిస్తారు. ఈ రోజు నైవేధ్యంగా అల్లం గారెలు నైవేధ్యంగా సమర్పిస్తారు.
ఐదవ రోజు: ఐదవ రోజున అమ్మవారు శ్రీ చండీ దేవిగా అలంకరం చేస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. నైవేధ్యంగా రవ్వ కేసరి సమర్పిస్తారు.
ఆరవ రోజు: ఈ రోజు అమ్మవారు శ్రీ మహలక్ష్మి దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ముదురు గులాబి రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రోజు నైవేధ్యంగా పూర్ణం బూరెలు సమర్పిస్తారు.
ఏడవ రోజు: ఈ రోజు అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. నైవేధ్యంగా దధ్దోజనం నివేదిస్తారు.
ఎనిమిదో రోజు: అమ్మవారు ఈ రోజు దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని అలంకారణ చేస్తారు ఈ రోజు అమ్మవారికి నైవేధ్యంగా కూరగాయలతో వండిన అన్నాన్ని నైవేధ్యంగా సమర్పిస్తారు.
తొమ్మిదవ రోజు: ఈ రోజు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరం ఇస్తారు. అమ్మవారికి ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. నైవేధ్యంగా చక్కర పొంగలి నివేదిస్తారు.