||శబరిమల అయ్యప్పస్వామి||
అయ్యప్ప భక్తులు స్వామి దీక్ష తీసుకుంటూ శబరిమల వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు. చలికాలం వచ్చిందంటే అయ్యప్ప దీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే, దీక్ష సమయంలో అయ్యప్పలు తీసుకొనే జాగ్రత్తలు ఏమిటో చాలా మందికి తెలియవు. కొత్తగా దీక్ష తీసుకొనేవారు తెలియక తప్పులు చేస్తుంటారు. కొందరికి తెలిసినా, తొందరలో మర్చిపోతుంటారు. కాబట్టి ప్రతి నిబంధనను కచ్చితంగా పాటిస్తేనే చేపట్టే దీక్షకు ఫలితం ఉంటుంది. దాంతో దైవానుగ్రహం కలుగుతుంది.
జాగ్రత్తలివీ..
- ప్రతి రోజు పొద్దున్నే సూర్యోదయానికి ముందు మేల్కొని కాలకృత్యాలు తీర్చుకోవాలి. చన్నీళ్లతో తలస్నానం చేయాలి.
- స్వామికి దీపారాధన చేసి, స్వామి స్తోత్రం పఠించాలి. ఆ తర్వాతే మంచి నీళ్లు తాగాలి.
- సాయంత్రం కూడా చన్నీళ్ల స్నానం చేసి స్వామి పూజ చేసి, రాత్రి పూట భిక్ష చేయాలి.
- నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి. కాళ్లకు చెప్పులు వేసుకోరాదు.
- మెడలో ధరించిన మాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తీయకూడదు. శబరిమల చేరుటకు 41 రోజుల ముందే దీక్ష ప్రారంభించాలి.
- దీక్షలో ఉన్నపుడు గడ్డం, క్షవరం చేయించుకోరాదు. గోళ్లు కత్తిరించుకోకూడదు.
- అస్కలిత బ్రహ్యచర్యం పాటించాలి. దీక్షాకాలంలో దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి.
- పరుపులు, మెత్తలు ఉపయోగించకూడదు. నేల మీదు చాప పరుచుకొని పడుకోవాలి.
- శవాన్ని, బహిష్టు స్త్రీలను చూడరాదు. చూస్తే స్నానం చేసి స్వామి శరణు ఘోష చెప్పాకే నీళ్లు తాగాలి.
- దీక్షలో స్వామియే శరణమయ్యప్ప అన్న మూలమంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
- స్త్రీలను (భార్యతో సహా) దేవతామూర్తులుగా భావించాలి.
- ఎవరినైనా పిలిస్తే పేరు చివర అయ్యప్ప అని అనాలి. స్త్రీలను పిలిస్తే మాతా అని పిలవాలి.
- ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించకూడదు.
- ఎల్లప్పుడు నుదుట విభూది, చందనం, కుంకుమ బొట్టు పెట్టుకొని ఉండాలి.
- మద్యానికి, పొగాకుకు దూరంగా ఉండాలి. తాంబూలం కూడా నిషిద్ధం.
- ప్రతి రోజు సాత్వికాహారం తీసుకోవాలి.
- ఎల్లప్పుడు స్వామి భజనల్లో సేద తీరాలి. అబద్ధాలు ఆడరాదు. దుర్భాష చేయరాదు.
- దీక్షా సమయంలో కనీసం ఒక్కసారైనా నలుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టడం మంచిది.
- స్వామి వారిని ఉదయం, సాయంత్రం కర్పూర హారతి ఇవ్వాలి.
- దీక్షా సమయంలో వయసు, హోదా, అంతస్థుతో సంబంధం లేకుండా సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయటకు వెనుకాడొద్దు.
- తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం చేయవచ్చు. కానీ దీక్ష లేనివారికి పాదాభివందనం చేయకూడదు.
- నల్లని దుస్తులే ఎందుకంటే: నల్లని రంగు వేడిని ఆకర్షిస్తుంది. చలికాలంలో దీక్ష కాబట్టి వెచ్చదనాన్ని కలిగించేలా ఈ దుస్తులు ధరిస్తారు. ఈ రంగు కూడా వైరాగ్యానికి ప్రతీక.
సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్