కూర్గ్ మడికేరి శాంతి ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ ప్రసిద్ధ శిల్పకళను ప్రదర్శించే అందమైన దేవాలయాలు కూడా ఈ పట్టణంలో చూడవచ్చు. మడికేరిలోని ఉన్న ప్రముఖ దేవాలయాలు ఏవి కూర్గ్ వెళ్లినప్పుడు సందర్శించాల్సి ప్రముఖ ఆలయాల గురించి తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
కూర్గ్ ను..కొడగు అని కూడా పిలుస్తారు. ఇది కర్ణాటకలోని పచ్చని హిల్ స్టేషన్. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ హనీమూన్ గమ్యస్థానాలలో ఒకటి. దట్టమైన అడవులు,మేఘాల్లో తేలియాడుతున్న కనిపించే కొండలు, నిర్మలమైన సరస్సులు, మనోహరమైన ఉద్యానవనాలు, మనసుకు హత్తుకునే దేవాలయాలతో భక్తులను కనువిందు చేస్తున్న ఈ ప్రదేశం వారాంతపు ప్రదేశాలలో ఒకటి. కూర్గ్ కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కూర్గ్ అందంగా చెక్కిన అనేక దేవాలయాలకు నిలయం. ఈ దేవాలయాలు కూర్గ్ పురాతన చరిత్రను తెలుపుతాయి. మడికేరి సందర్శించేటప్పుడు మీరు చూడాల్సిన ఈ 5 దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భగందేశ్వర దేవాలయం:
కూర్గ్‌లోని భాగమండల్ గ్రామంలో ఉన్న ఒక పురాతన పవిత్ర క్షేత్రం.దీనిని భగండేశ్వర్ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇది కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. కావేరి, సుజ్యోతి , కన్నికే మూడు నదుల సంగమాన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు. అంతేకాదు దీనిని దక్షిణ కాశీగా కూడా పరిగణిస్తారు. అలాగే తలకావేరికి వెళ్లే ముందు, యాత్రికులు సంగమంలో స్నానం చేసి తమ పూర్వీకులకు పూజలు చేయడం ఆనవాయితీ. చుట్టూ భారీ గోడలతో తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయ సముదాయం 11వ శతాబ్దానికి ముందు చోళులు నిర్మించినట్లు చెబుతారు. ఇది కేరళ ఆలయ నిర్మాణ శైలిలో గేబుల్ పైకప్పు వలే ఉంటుంది. ఈ ఆలయంలో భగవాన్ నారాయణ, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు.
గోల్డెన్ టెంపుల్:
నామ్‌డ్రోలింగ్ మొనాస్టరీ లేదా టిబెటన్ మొనాస్టరీ అని కూడా పిలిచే.. గోల్డెన్ టెంపుల్ కూర్గ్‌లోని అత్యంత ప్రసిద్ధ టిబెటన్ మఠాలలో ఒకటి. ఇది మడికేరి నుండి 34 కి.మీ దూరంలో బైలకుప్పే వద్ద ఉంది. 40 అడుగుల ఎత్తైన బుద్ధుడు,బంగారు విగ్రహాలు, బౌద్ధ టిబెటన్ పురాణాలను వివరించే ఆలయ గోడలపై అలంకరణ పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఓంకారేశ్వరాలయం:
లింగరాజేంద్రచే నిర్మించిన ఓంకారేశ్వరాలయం కూర్గ్‌లోని ప్రసిద్ధ, పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం శివునికి అంకితం చేశారు. కూర్గ్ టూర్ ప్యాకేజీలలో తప్పనిసరిగా చేర్చవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి. ఆలయం లోపల ప్రతిష్టించిన శివలింగం దివ్య భూమి కాశీ నుండి తీసుకువచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇస్లామిక్,గోతిక్ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం నాలుగు మూలల్లో నాలుగు మినార్లతో కూడిన పెద్ద మధ్య గోపురం కలిగి ఉంటుంది. గోడలను ఆకట్టుకునే పెయింటింగ్స్‌తో అలంకరించారు. కిటికీ ఫ్రేమ్‌లు పంచలోహాలతో తయారు చేశారు. అందమైన చెరువు చుట్టూ, గర్భగుడి లోపల ఉన్న పురాతన శివలింగానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.
తలకావేరి దేవాలయం:
కొడగులోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటైన తలకావేరి ఆలయం.. 1276 మీటర్ల ఎత్తులో బ్రహ్మగిరి కొండల వాలుపై ఉంది. కర్నాటక, తమిళనాడుల గుండా ప్రవహించే కావేరీ నదికి ఈ ప్రాంతాన్ని మూలం అని అంటారు. ఇది కూర్గ్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. మైసూర్ సమీపంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. ఆలయ ప్రాంగణంలో కావేరీ కుండికే లేదా బ్రహ్మ కుండికే అనే చతురస్రాకార కల్యాణి ఉంది. ఇది కావేరీ నది జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. తులారాశి సమయంలో ఈ ప్రదేశంలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ రోజున కావేరీ దేవి భూమిపైకి వచ్చిందని నమ్ముతారు.
పాడి ఇగ్గుటప్ప దేవాలయం:
1810లో లింగ రాజేంద్రచే నిర్మించిన పాడి ఇగుతప్ప దేవాలయం కక్కబే అనే చిన్న గ్రామంలో ఉన్న ఒక పవిత్రమైన హిందూ దేవాలయం. ఇది కొడవర్ అతి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. కర్ణాటకలో సందర్శించడానికి ఉత్తమమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. సుబ్రహ్మణ్య భగవానుడికి అంకితం చేసిన ఈ ఆలయాన్ని ముఖ్యంగా కోడుల కోసం వర్షం, పంటల ప్రభువు అని కూడా పిలుస్తారు. తరువాత, ఈ ఆలయాన్ని 2008లో కర్ణాటక ప్రభుత్వం పునర్నిర్మించింది. ఈ దేవాలయం కొండపై నెలకొని ఉన్నందున, ఇది నిటారుగా ఉండే మెట్లతో కేరళ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది.