పుష్య మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదో తెలుసా..

డిసెంబర్ 31 తేదిన పుష్య మాసం ప్రారంభమై జనవరి 29 బుధవారం అమావాస్య తిథితో పుష్యమాసం ముగుస్తుంది. శనిదేవుని జన్మనక్షత్రం పుష్యమి కాబట్టి ఈ నెలంతా శనీశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం.

PUSHYA MASAM

ప్రతీకాత్మక చిత్రం

డిసెంబర్ 31 తేదిన పుష్య మాసం ప్రారంభమై జనవరి 29 బుధవారం అమావాస్య తిథితో పుష్యమాసం ముగుస్తుంది. శనిదేవుని జన్మనక్షత్రం పుష్యమి కాబట్టి ఈ నెలంతా శనీశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం. ఈ పుష్యమాసంలో శనీశ్వరుడిని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శనీశ్వరుడు మంచి చేసేవారికి విపరీతమైన ధనాన్ని కురిపిస్తాడు, చెడు చేసేవారికి శనిదోషాన్ని పట్టి పీడిస్తాడు. కాబట్టి శనికి ప్రీతికరమైన మాసం ఈ పుష్యమాసం. ఈ పుష్యమాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

ప్రస్తుతం పుష్యమాసం నడుస్తోంది. ఈ నెల రోజులు గృహప్రవేశాలు చేయకూడదు, ఇంటి శంకుస్థాపనాలు ప్రారంభించకూడదు. వివాహాది శుభకార్యాలు చేయకూడదు. ఈ పుష్యమాసంలో వచ్చే ఆదివారం రోజున ఉసిరికాయలను, నెయ్యి తినకూడదు. తింటే మీ జాతకంలో అష్టమ శని దోషాలు ఏర్పడుతాయి, మీ ఇంట్లో లక్ష్మీదేవి నిల్వ ఉండదు. ముల్లంగి దుంపను కూడా తినకూడదు. ముల్లంగిని తింటే ఈ సంవత్సరం అంతా పేదరికం వెంటాడుతుంది. ఈ నెలలో వెండి పొరపాటున కూడా కొనకూడదు. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే అది మళ్లీ తిరిగి మీ చెంతకు రాదు. ఈ పుష్యమాసంలో వచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి నాడు శివునికి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సకల దరిద్రాలు తొలగిపోయి, సకల భోగభాగ్యాలు కలుగుతాయి. ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులను దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు తొలిగిపోతాయి.

గమనిక: ఈ సమాచారం ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మిక వేత్తల ద్వారా సేకరించినది మాత్రమే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్