గోమాత ఈ భుమి మీద ఉన్న స్త్రీలందరికీ ఒక శాపం ఇచ్చిందనే విషయం మీకు తెలుసా? ఆ శాప ఫలితాన్ని ఇప్పటికీ ప్రతి స్త్రీ అనుభవించాల్సి వస్తోంది. ఇంతకి గోమాత స్త్రీలను ఎందుకు శపించింది? ఆ శాపం ఏమిటి? గోమాత స్త్రీలను ఎందుకు శపించిందో తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
గోమాత ఈ భుమి మీద ఉన్న స్త్రీలందరికీ ఒక శాపం ఇచ్చిందనే విషయం మీకు తెలుసా? ఆ శాప ఫలితాన్ని ఇప్పటికీ ప్రతి స్త్రీ అనుభవించాల్సి వస్తోంది. ఇంతకి గోమాత స్త్రీలను ఎందుకు శపించింది? ఆ శాపం ఏమిటి? గోమాత స్త్రీలను ఎందుకు శపించిందో తెలుసుకుందాం.. ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరకి నారదుడు వచ్చి.. ‘ఓ ప్రభూ! నేను ఈ రోజు మృత్యలోకానికి వెళ్లాను. అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది. అదేంటంటే ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు. కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే నడవటం లేదు. దీనికి కారణం ఏమిటి? అని నన్ను అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరకు వచ్చాను. దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి’ అని అడిగాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారదముని.. మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే నేను మీకు ముందుగా ఒక కథ చెబుతాను కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది. అదేంటంటే ఈ కథను ప్రతిఒక్కరూ పూర్తిగా వినాల్సి ఉంటుంది. మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్లిపోతే నరకలోకం ప్రాప్తిస్తుంది. కానీ ఎవరైతే పూర్తిగా వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు.
‘రామచంద్రు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా స్వార్ధపరుడు. అతనికి ఒక ఆవు ఉండేది. ఆ ఆవుకి పచ్చిమేత దానగా వేస్తుండేవాడు. ఆ ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది. ఆ పాలు అమ్ముకొని జీవించేవాడు. ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచింది. సమయం గడిచేకొద్దీ ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసింది. ఆ ఆవు పాలు ఇవ్వడం లేదని గమనించిన రామచంద్రు ఆ ఆవుకి గడ్డి ఇవ్వడం మానేసాడు. ఒకరోజు రామచంద్రు ఆ ఆవుని బాగా కొట్టి అడవిలో వదిలేసి వెళ్లాడు. ఆ అడవిలో ఆ ఆవుకి ఒక గుడి కనిపించింది. ఆవు అలయం దగ్గరకు వెళ్లి తన బాధలన్నీ చెప్పుకొని విలపించింది. కొన్ని రోజులకు ఆ ఆవు గర్భం దాల్చింది. ఒకరోజు ఆ అడవిలో ఆవుకి ఒక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ ఆవుని చూసి తన ఇంటికి తీసుకెళ్తామని అనుకుంది. కానీ ఆవు అంతలోనే కనిపించకుండా పోయింది. అదే స్త్రీ మరుసటిరోజు అడవికి వెళ్లగా ఆవు లేగ దూడెతో కనిపించింది. ఆ స్త్రీ ఇప్పటికైనా ఆవుని తన వెంట తీసుకువెళ్దాం అని అనుకునేలోపే ఆవు.. అమ్మ నీకు పుణ్యం ఉంటుంది నా బిడ్డను నా మెడ మీద పెట్టవా..! నేను నా బిడ్డను తీసుకొని సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోతాను. ఈ ఒక్క సహయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను. లేదంటే నా బిడ్డ చనిపోతుంది. ఓ 8 నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకుంటుంది. తన సంరక్షణ తాను చూసుకుంటాడు అని ఆ ఆవు స్త్రీని వేడుకుంది. అయితే ఆవు మాటలు విన్న ఆ స్త్రీ గట్టిగా నవ్వి.. నీ బిడ్డ మురికిగా ఉంది. నేను ఎత్తి నీ మీద కుర్చోబెట్టాలా? నేను నీకు ఉత్తి పుణ్యానికి ఎందుకు సహయం చేయాలి? నీలాంటి మురికి వాళ్లను నేను తాకడానికి కూడా ఇష్టపడను అని హేళన చేసింది. ఎంతగానో బాధపడిన ఆ ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా శపించింది.. ‘నీ బిడ్డ పుట్టగానే నడవగలడు అనే కదా నీకు అహంకారం. అయితే నేనిప్పుడు నిన్ను శపిస్తున్నా. నీ బిడ్డ పుట్టిన 10 నెలల తర్వాతే నడక నేేర్చుకుంటుంది. ఇదే నా శాపం అని ఆవేశంతో ఆ స్త్రీని శపించింది. ఆ శాపం ఒక్క మహిళకే కాక.. లోకంలోని అందరు మహిళలకు శాపం తగిలింది. ఒకప్పుడు దూడ పుట్టిన వెంటనే నడిచేది కాదు. 8 నెలల తర్వాతే నడిచేది’ అని శ్రీ కృష్ణుడు వివరించాడు.