భార్యాభర్తలు నిద్రపోయే ముందు ఈ సూత్రాలు పాటిస్తే జీవితంలో గొడవలు ఉండవని చాణక్యుడు చెబుతున్నాడు.
ప్రతీకాత్మక చిత్రం
భార్య భర్తల మధ్య గొడవలు సహజమే. చిన్న గొడవలైనా..పెద్ద గొడవలైనా సర్థుకుపోయే గుణం ఇద్దరిలో ఉంటే ఆ సంసారం సజావుగా సాగుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా బంధాన్ని తెంచుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే కొందరి ఇండ్లలో ప్రతిరోజూ భార్యభర్తలు మధ్య గొడవలు జరగుతుంటాయి. ఈ గొడవలు ఆ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తాయి. చాణక్యుడు తన చాణక్య నీతిలో భార్యాభర్తలు తమ వైవాహిక జీవితంలో ఎలా సంతోషంగా ఉండవచ్చో వివరించారు. భార్యాభర్తలు రాత్రి పడుకునే ముందు ఈ 5 పనులు చేయమని సలహా ఇస్తున్నారు. అవేంటో చూద్దాం.
భార్యాభర్తలు కలిసి రాత్రి భోజనం చేయాలి.ఇలా కలిసి భోజనం చేయడం అనేది ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం పెరుగుతాయి.మీ భాగస్వామి కోరికలను ఎప్పుడూ విస్మరించవద్దు. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి రాత్రిపూట మీ భాగస్వామి కోరికను తీర్చండి.రాత్రి పడుకునే ముందు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసి నిద్రపోవాలి. ఎందుకంటే రోజంతా ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోలేరు.
ఇది ఇద్దరి మధ్య అంతరాయాన్ని పెంచుతుంది. దాన్ని పూడ్చుకోవడానికి రాత్రి పూట హాయిగా నవ్వుతూ, మాట్లాడుకుంటూ పడుకుంటే ప్రేమ మరింత బలపడుతుంది.మీ భాగస్వామికి ఆ రోజు ఏదైనా సమస్య వచ్చినా లేదా మీకు సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించుకుని ప్రశాంతమైన తర్వాత నిద్రపోవడం మంచిది.భార్యాభర్తలిద్దరూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే తమ ప్రేమను వ్యక్తపరచడం తప్పనిసరి. ఒకరి చేతులు మరొకరు పడుకోవడం వల్ల మీ బంధం బలపడుతుందని అంటారు చాణక్యుడు.