దీపావళి అక్టోబర్ 31వ తేదీన అని కొందరు.. కాదు నవంబర్ 1వ తేదీన అని మరికొందరు చెప్తున్నారు. కొన్ని క్యాలెండర్లలో అక్టోబర్ 31 అని, కొన్ని క్యాలెండర్లలో నవంబర్ 1వ తేదీన అని ఉంది. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
లక్ష్మీ దేవి
దీపావళి అక్టోబర్ 31వ తేదీన అని కొందరు.. కాదు నవంబర్ 1వ తేదీన అని మరికొందరు చెప్తున్నారు. కొన్ని క్యాలెండర్లలో అక్టోబర్ 31 అని, కొన్ని క్యాలెండర్లలో నవంబర్ 1వ తేదీన అని ఉంది. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అసలు ఏ తేదీన దీపావళి పండుగ జరుపుకోవాలి? ఏ రోజున లక్ష్మీపూజ చేసుకోవాలి? అని సందేహపడుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్య, పంచాంగ పండితులు పండుగ తేదీపై క్లారిటీ ఇచ్చారు. దీపావళి పండుగ జరుపుకోవడానికి ఏ తేదీ సరైనదో వెల్లడించారు. అయితే, అసలు దీపావళి పండుగ ఎందుకు వచ్చింది? ఆ పండుగకు శుభ సమయం ఏదో తెలిస్తే మనకే క్లారిటీ వచ్చేస్తుంది. వాస్తవానికి శ్రీరాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు చేరిన రోజు.. నరకాసురుడిని సత్యభామ చంపింది ఒకే రోజు. అదే.. దీపావళి. చెడుపై మంచి గెలిచిన రోజు కూడా ఇదే రోజు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటాం.
అయితే, అమావాస్య రోజు ప్రదోష కాలం(సూర్యాస్తమయం తర్వాత వచ్చే సమయం)లో లక్ష్మీ పూజ చేసి, దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి అక్టోబర్ 31వ తేదీన సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 8.52 గంటల మధ్య లక్ష్మీ పూజకు సరైన సమయం అని పండితులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. దీపావళి పండుగను అక్టోబర్ 31న చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రదోష సమయంలో అమావాస్య తిథి బలంగా ఉంటుందని, అది అక్టోబర్ 31నే అయినందున ఆరోజే దీపావళి జరుపుకోవాలని పేర్కొంటున్నారు.
దీపావళి పండుగకు శుభముహూర్తం ఇదే..
దీపావళి పండుగ : అక్టోబర్ 31
లక్ష్మీపూజ సమయం : సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 8.52 గంటల వరకు
అమావాస్య తిథి ప్రారంభం : అక్టోబర్ 31, 03: 52 సాయంత్రం
అమావాస్య తిథి ముగింపు : నవంబర్ 1, 06:16 సాయంత్రం
ఐదు రోజుల దీపావళి ఇలా జరుపుకోవాలి..
29 అక్టోబర్ 2024దంతేరాస్ (బంగారం కొనుగోలు మంచి రోజు)
31 అక్టోబర్ 2024చోటీ దీపావళి (నరకాసురుడిని చంపిన రోజు)
31 అక్టోబర్ 2024బడి దీపావళి (లక్ష్మీదేవి పూజ చేసే రోజు)
2 నవంబర్ 2024గోవర్ధన్ పూజ (బృందావన ప్రజలను కాపాడేందుకు శ్రీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు)
3 నవంబర్ 2024భాయ్ దూజ్ (రాఖీ లాగే.. సోదరులకు సోదరీమణులు తిలకం దిద్ది ఆశీర్వదించే రోజు)