చాలా మంది శివలింగాన్ని, జ్యోతిర్లింగాన్ని ఒకేలా భావిస్తారు. కానీ రెండింటి అర్థం వేరు. ఇంతకీ శివలింగానికి జ్యోతిర్లింగానికి తేడా ఏమిటి.? జ్యోతిర్లింగం, శివలింగం ఒకటేనా? తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతి శివ భక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా శివునికి అంకితం చేసిన 12 జ్యోతిర్లింగాలను దర్శించాలని కోరుకుంటాడు. ఎందుకంటే హిందువులలో జ్యోతిర్లింగాల ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది.మహాశివుని..ఈ 12 జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే జీవితంలోని అన్ని కష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు ప్రతిరోజూ లేదా సోమవారాల్లో శివలింగాన్ని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతుంటారు.మత విశ్వాసాల ప్రకారం, ప్రతిరోజూ శివలింగానికి నీటిని సమర్పించడం ద్వారా, మహాదేవుడు సంతోషించి.. భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడని చెబుతుంటారు. శివలింగానికి, జ్యోతిర్లింగానికి మధ్య ఉన్న తేడాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జ్యోతిర్లింగం,శివలింగం మధ్య తేడా ఏమిటి?
జ్యోతిర్లింగం అంటే ఏమిటి?
శివ పురాణం ప్రకారం, శివుడు ఎక్కడ కాంతి రూపంలో కనిపిస్తాడో అక్కడ జ్యోతిర్లింగంగా పిలుస్తారు. మనదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. వీటిని సందర్శించడం వల్ల మనకు మహాదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.
శివలింగం అంటే ఏమిటి?
శివలింగం అనేది మానవ నిర్మిత లేదా స్వయంగా ఉద్భవించిన శివ రూపం. శివ పురాణం ప్రకారం, శివలింగం అంటే అనంతం. దానికి ఎలాంటి ముగింపు లేదు. శివుని చిహ్నంగా, భక్తులు శివలింగాన్ని పూజించి, ప్రతిష్టించి ఇంట్లో ప్రతిష్టించడానికి ఇష్టపడతారు. శివలింగాన్ని ఆరాధించడం ద్వారా, ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది. మహాశివుని ఆశీస్సులు కుటుంబంపై ఉంటాయి.
12 జ్యోతిర్లింగాలు, వాటి స్థానాలు:
- సోమనాథ్ ఆలయం: గుజరాత్
- మల్లికార్జున: ఆంధ్రప్రదేశ్
- మహాకాళేశ్వరం: ఉజ్జయిని
- రామేశ్వర్ జ్యోతిర్లింగం: తమిళనాడు
- ఖాండ్వా ఓంకారేశ్వర్: మధ్యప్రదేశ్
- రుద్రప్రయాగలో కేదార్‌నాథ్: ఉత్తరాఖండ్
- భీమా శంకర్: మహారాష్ట్ర
- వారణాసి వద్ద విశ్వనాథ్: ఉత్తరప్రదేశ్:
- నాసిక్ వద్ద త్రయంబకేశ్వర్: మహారాష్ట్ర
- ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం: ఔరంగాబాద్
- వైద్యనాథ్ జ్యోతిర్లింగం దియోఘర్: జార్ఖండ్
- ద్వారక నాగేశ్వరుడు: గుజరాత్