||ప్రతీకాత్మక చిత్రం||
మేషం
మీ నిరాశావాదంతో వృద్ధిని పొందలేరు. దానివల్ల ఆలోచన శక్తి తగ్గుతుంది. మీ తోబుట్టువులు డబ్బు అడిగే అవకాశం ఉంది. అలాగని చేస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఇంటి విషయాలను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులపై ఆకస్మిక తనిఖీ చేయొచ్చు. ఈ రాశివారు ఈ రోజు వ్యాపారంలో కొత్త కోణం చూస్తారు.
వృషభం
ఆరోగ్యం బాగుంటుంది. చాలా కాలం నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. దాంతో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మనవళ్లు, మనవరాళ్లు మిమ్మల్ని ఆనందంలో ఉంచుతారు. మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకోవాలి. అనుకోని ప్రయాణం ఒత్తిడిని కలిగిస్తుంది.
మిథునం
ఆలోచించకుండా ఖర్చు చేయొద్దు. లేకపోతే అత్యవసర సమయాల్లో దాని విలువ తెలుస్తుంది. ఇంటర్వ్యూలకు మంచి రోజు. స్వీయ ఆనందానికి చాలా సమయం దొరుకుతుంది. మీ కోరికలను తీర్చుకోవటానికి పుస్తకాలు చదువుతారు, పాటలు వింటారు.
కర్కాటకం
ఆర్ధికపరమైన, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లాభం చేకూరుతుంది. విభిన్నమైన రొమాన్స్‌ను ఎంజాయ్ చేస్తారు. మీ వృత్తిపరమైన శక్తి మీ కెరీర్ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పనిచేయబోయే చోట అసామాన్య విజయాన్ని అందుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
సింహ
ఈ రోజు మీపై మీకు నమ్మకం ఎక్కువ. అప్పు తిరిగి చెల్లించనివారిపట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన మంచి పనులకు ఆఫీస్‌లో మిమ్మల్ని గుర్తిస్తారు. మీ టైంను వృధా చేసేవారిపట్ల జాగ్రత్త. మీ జీవిత భాగస్వామి నుంచి మంచి కౌగిలింత అందుకుంటారు.
కన్య
నవ్వు మీకు మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. మీ సమస్యలకు ఇది సర్వ రోగ నివారిణి. అనుకోని ఖర్చులు ప్రశాంతతను దెబ్బతీస్తాయి. రొమాన్స్‌కు ఈ రోజు అవకాశం లేదు. మీ తెలివితేటలు, దౌత్యాన్ని ప్రదర్శిస్తే ఈ రోజు మీకు తిరుగు ఉండదు.
తుల
అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. అనుకోని కానుకలు, బహుమతులు అందుతాయి. కొత్త ప్రతిపాదనలు ఆకర్షణీయంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఈ రోజు మొత్తం ఫోన్‌కు అతుక్కుపోతారు.
వృశ్చికం
మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లబ్ధి జరుగుతుంది. కొత్త వ్యాపారం, వెంచర్ మొదలుపెట్టాలనుకుంటే తొందరగా నిర్ణయాలు తీసుకోండి. గ్రహ నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయి. ఏం చేయాలనుకున్నా భయపడకుండా చేయండి. వైవాహిక జీవితానికి సంబంధించిన వాస్తవాలు మీ కళ్ల ముందు కనిపిస్తాయి.
ధనుస్సు
గర్భవతులు గచ్చుపై నడిచే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని లబ్ధి జరిగి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ఒక మంచి, పెద్ద పనిలో భాగం అవుతారు. దాని వల్ల మీకు ప్రశంసలు దక్కుతాయి. రివార్డులు అందుతాయి. మీ బంధువు లేదా దగ్గరి వారు మీవైవాహిక జీవితంలో ఇబ్బందులు కలగజేస్తారు.
మకరం
రక్త పోటు ఉంటే బస్సు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. అలంకారాలు, నగలపై మదుపుతో లాభాలు అందుకుంటారు. మీ ప్రియమైనవారికి మధ్య మూడో వ్యక్తి జోక్యం కోపాన్ని తెప్పిస్తుంది. సహోద్యోగుల నుంచి మంచి సహకారం అందుతుంది. మీ జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే చాన్స్ ఉంది.
కుంభం
శారీరకంగా బలహీనంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగం రానివాళ్లు కష్టపడితే లాభం ఉంటుంది. పన్ను, బీమా అంశాలపై దృష్టి సారిస్తారు. మీ భార్య, భార్త వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే వారికి కోపం వస్తుంది జాగ్రత్త.
మీనం
వృద్ధి అంతగా ఉండదు. ఇంటి పెద్దలు డబ్బు దాచే సలహాలు ఇస్తారు. అవి మీకు ఉపయోగపడతాయి. మీ వల్ల ఇబ్బంది పడ్డ వారికి సారీ చెప్పండి, మీకు అంతా మంచి జరుగుతుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. ప్రమాదాలకు చాన్స్ ఉంది. అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.