||ప్రతీకాత్మక చిత్రం||
మేషం : అనవసర ఖర్చు నియంత్రించుకోండి. లేకపోతే ధనానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ వ్యక్తిగత విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. అకస్మాత్తుగా రొమాంటిక్‌గా కనిపిస్తారు. మీ జీవిత భాగస్వామితో అత్యంత సన్నిహితంగా గడుపుతారు.
అదృష్ట సంఖ్య : 3, అదృష్ట రంగు : కాషాయం, పసుపు
వృషభం : ఒత్తిడితో ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక లబ్ధి కలుగుతుంది. డ్రైవింగ్ చేసేప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయిస్తారు. ఇంటి సభ్యులతో గడుపుతారు.
అదృష్ట సంఖ్య : 2, అదృష్ట రంగు : వెండి, తెలుపు
మిథునం : విపరీతమైన పని కోపం తెప్పిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ జవసత్వాలు మళ్లీ ఉత్తేజితం అవుతాయి. రొమాన్స్ ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంటుంది.
అదృష్ట సంఖ్య : 9, అదృష్ట రంగు : ఎరుపు, పసను
కర్కాటకం : కుటుంబ వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్త ఒప్పందాలు లబ్ధిని కలగజేస్తాయి. పాత సమస్యల వల్ల గొడవలు వస్తాయి. రుచికరమైన పదార్థాలను రుచి చూస్తారు.
అదృష్ట సంఖ్య : 3, అదృష్ట రంగు : కాషాయం, పసుపు
సింహ : ప్రయాణం చేస్తారు. ఖర్చు పెట్టే మూడ్‌లో ఉంటారు. మనుమలు మీకు ఆనంద కారకులు అవుతారు. వ్యాపార ప్రణాళిక ఫలవంతం అవుతుంది. ఈ రోజు అద్భుతంగా గడుస్తుంది. ఓపికగా ఉండండి.
అదృష్ట సంఖ్య : 2, అదృష్ట రంగు : వెండి, తెలుపు
కన్య : ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చుల వల్ల ప్రశాంతత దెబ్బతింటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి సర్‌ప్రైజ్ అందుకుంటారు. ఖర్చులపై శ్రద్ధ పెట్టండి.
అదృష్ట సంఖ్య : 9, అదృష్ట రంగు : ఎరుపు, పసను
తుల : సంతోషకరమైన వార్త వింటారు. ముఖ్యమైన వస్తువును పోగొట్టుకుంటారు. అభిప్రాయభేదాలు వస్తే కోపాన్ని నియంత్రించుకోండి. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపండి. ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
అదృష్ట సంఖ్య : 3, అదృష్ట రంగు : కాషాయం, పసుపు
వృశ్చికం : పొద్దుపోయేదాకా పని మానండి. డబ్బు విలువ తెలిసిన మీరు ధనాన్ని దాచిపెడతారు. అది విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఎంగేజ్‌మెంట్ అయినవారికి ఫియాన్సీ సంతోషకరంగా పొందుతారు. ఈ రోజు చాలా బాగుంటుంది.
అదృష్ట సంఖ్య : 4, అదృష్ట రంగు : గోధుమ, బూడిద
ధనుస్సు : బయటి కార్యక్రమాలు ఒత్తిడిని పెంచుతాయి. ప్రేమ, స్నేహం ఎదుగుతాయి. రొమాంటిక్ భావనలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి మీకోసం ఈరోజు ఏదో ఒక స్పెషల్ చేస్తారు.
అదృష్ట సంఖ్య : 1, అదృష్ట రంగు : ఆరెంజ్, బంగారం
మకరం : ఈ రోజు మీకు విశ్రాంతి అవసరం. తోబుట్టువుల నుంచి సహాయం అందుతుంది. చుట్టాల రాక పెరుగుతుంది. కొత్త అలవాట్లు ఏర్పడతాయి. మీ జీవితభాగస్వామి మీ మాట వినకపోతే సహనాన్ని కోల్పోవద్దు.
అదృష్ట సంఖ్య : 1, అదృష్ట రంగు : ఆరెంజ్, బంగారం
కుంభం : మీ జీవితభాగస్వామి వ్యవహారాల్లో తలదూర్చి కోపానికి గురికావొద్దు. మీ అలవాట్లు మీ ప్రియమైనవారికి అసహనం కలిగిస్తాయి. మీ మనసు నియంత్రణలో ఉంచుకోండి. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మంచి రోజు అవుతుంది. ధ్యానం చేసి ఒత్తిడిని తగ్గించుకోండి.
అదృష్ట సంఖ్య : 8, అదృష్ట రంగు : నలుపు, నీలం
మీనం : గాలిలో మేడలు మీకు కలిసిరావు. డబ్బు ఖర్చు విధానం తెలుసుకుంటారు. మీ సోదరుడి పరిస్థితులు అదుపు చేసుకోవటానికి సహకరించండి. వ్యక్తిగత బంధుత్వాలు ప్రమాదకరంగా ఉంటాయి.
అదృష్ట సంఖ్య : 6, అదృష్ట రంగు : పారదర్శక, చంద్రిక