||ప్రతీకాత్మక చిత్రం||
మేషం
మీ స్నేహితుడితో అపార్థాలు వస్తాయి. దాంతో అవాంఛనీయ పరిస్థితులు ఎదురవుతాయి. సమస్య పరిష్కారం అయ్యేవరకు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వాటిని దానధర్మాలకు వినియోగిస్తారు. దీంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. ఇంట్లో జరిగే మార్పులు మీకు సెంటిమెంట్‌గా పనిచేస్తాయి. వృత్తి బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి.
వృషభం
పిల్లలు లేదా వృద్ధుల ఆరోగ్యం పాడవటం మీ వైవాహిక బంధంపై ప్రభావం చూపుతుంది. ఆందోళన కలుగుతుంది. కుటుంబసభ్యుల కోసం ధనాన్ని ఖర్చుచేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అది తెలివైన పని కాదు. కుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. లేకపోతే పరిస్థితులు గొడవలకు దారి తీస్తాయి.
మిథునం
ఆరోగ్యం బాగుంటుంది. పనికి వచ్చే పని చేస్తే సంపాదన శక్తి పెరుగుతుంది. సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గరికి వస్తే పట్టించుకోకండి. వేరే వారి జోక్యంతో మీ ప్రియమైన వారితో సంబంధాలు దెబ్బతింటాయి. మనస్సును నియంత్రణలో ఉంచుకోండి.
కర్కాటకం
మీ భాగస్వామి ఆరోగ్యం ఒత్తిడికి గురిచేసే చాన్స్ ఉంది. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా వాడండి. పాత సంబంధాలను పునరుద్ధరించుకోవటానికి మంచి రోజు. పోటీ వల్ల పనికి తీరిక ఉండదు. ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అనవసరం.
సింహ
వ్యక్తిగత సమస్యలు ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఒత్తిడిని దూరం చేసుకొనేందుకు వ్యాయామం చేయండి. స్నేహితులతో పార్టీలకు వెళ్లి ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆర్థికంగా ఢోకా ఉండదు. సాధారణ పరిచయస్థులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవచ్చు. తొలి చూపులోనే ప్రేమలో పడే చాన్స్ ఉంది. ఆఫీస్‌లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంట్లో హోమాలు, వేడుకలు చేస్తారు.
కన్య
ఎక్కువ ప్రయాణాలు చేయొద్దు. అవి మానసికంగా ఇబ్బంది పెడతాయి. ఈ రోజు మీరు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దాంతో మానసిక సంతృప్తి దొరుకుతుంది. ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి కుటుంబంతో గడుపుతారు.
తుల
కుటుంబసభ్యులు కొందరు శత్రువుల్లా వ్యవహరిస్తారు. మీరు నిగ్రహం కోల్పోవద్దు. లేకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది. బయటికి వెళ్లే ముందు పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. కలిసి వస్తుంది. కోపం కష్టాల్లో పడేస్తుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన సమయం ఇది. ప్రేమైక జీవితం కాస్త కష్టంగా మారుతుంది. మీ ప్రయాణంలో వినోదం ఉంటుంది.
వృశ్చికం
ఔట్ పార్టీలకు వెళ్తారు. స్నేహితుల సహాయంతో ఆర్థిక సమస్యలకు ముగింపు పడే చాన్స్ ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆసరా దొరుకుతుంది. మీ బలాలు, భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోండి. ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.
ధనుస్సు
వ్యక్తిగత సమస్యలు ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మీ తోబుట్టువులు ఆర్థిక సహాయం అడుగుతారు. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. ముఖ్యమైన వ్యక్తులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. వారి నుంచి మంచి సలహా దక్కవచ్చు.
మకరం
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాటలు విని పెట్టుబడి పెడితే నష్టం వచ్చే చాన్స్ ఉంది. ఇంటర్వ్యూలకు మంచి రోజు. ఈరోజు కారణం లేకుండానే ఇతరులతో వాగ్వాదానికి దిగుతారు. సమయం వృధా అవుతుంది. భాగస్వామితో ప్రేమ, శృంగారంలో మునిగితేలుతారు.
కుంభం
సహోద్యోగులు, కింది స్థాయి ఉద్యోగుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ప్రేమించేవారికి బహుమతులు ఇచ్చుకొంటే మంచిది. ధైర్యంతో వేసే అడుగులు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి సర్ ప్రైజ్ అందుకొనే చాన్స్ ఉంది.అందుకోవచ్చు.
మీనం
పని ఒత్తిడి మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. ఇతరుల విజయాలను పొగుడుతారు. ఖర్చుపై నియంత్రణ ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ప్రేమించిన వారితో అపార్థాలు తొలగిపోతాయి. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈ రోజు మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. పైఅధికారుల మన్ననలు పొందుతారు. పనితనం వల్ల ప్రమోషన్ పొందుతారు.