Rashi Phalalu (06-04-2023) | ఈ రోజు రాశి ఫలాలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

మేషం

సమయానికి పని చేయక కొంత సమస్యలు ఏర్పడతాయి. నరాల వ్యవస్థ దెబ్బతినవచ్చు. విశ్రాంతి తీసుకుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. డబ్బు సంబంధ సమస్యలు నెత్తిమీదే తిరుగుతాయి. డబ్బును అతిగా ఖర్చు పెడతారు. అశ్రద్ధతో నష్టాలు కలుగుతాయి. మీ ఆర్థిక సంబంధ విషయాలపై తెలిసినవారు అతిగా స్పందించటం వల్ల ఇంట్లో ఇబ్బంది కర సమస్యలు వస్తాయి. మీ బిజీ షెడ్యూల్ వల్ల మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు.

వృషభం

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. డబ్బును విచ్చలవిడిగా వినోదాలకు ఖర్చు చేసే స్వభావాన్ని తగ్గించుకోవాలి. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకొని ఉండాలి. ఇతరులకు మరీ ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వీయ పనుల కోసం సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ, ఆ పనులు పెండింగ్‌లోనే ఉంటాయి. 

మిథునం

కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దాంతో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అలాంటి సమయంలో డబ్బు కంటే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన మీకు చికాకు తెప్పిస్తుంది. స్నేహం ప్రేమగా మారి మీకు దగ్గరవుతుంది. సృజనాత్మకత ఉన్నవారికి ఈ రోజు మంచి రోజు. పేరుకు గుర్తింపు లభిస్తుంది.

కర్కాటకం

అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఇంటి పెద్ద నుంచి ఆర్థిక పరమైన పొదుపు సూత్రాలు నేర్చుకుంటారు. మీరు అనుకున్నట్లు కుటుంబ పరిస్థితి ఉండదు. ఈ రోజు ఇంట్లో కలహాలు, గొడవలు ఏర్పడతాయి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. మీరు అదృష్టవంతులు. పెళ్లి అనుభూతిని అనుభవిస్తారు.

సింహ

ప్రశాంతతను, హాయిని పొందుతారు. ధనాన్ని స్థిరాస్థి సమస్యలపై ఖర్చు చేస్తారు. మీ ఆటుపోటు స్వభావం గురించి తెలిసినా మీ శ్రీమతి మీకు సహకారం అందిస్తారు. ఎంతో సాధించే శక్తి మీ సొంతం. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని, ముందుకు సాగండి. మీ భార్యతో సమయం కేటాయించకపోవటంతో ఆమెకు చికాకు తెప్పిస్తుంది.

కన్య

పొగ తాగే అలవాటు, మద్యం సేవించే అలవాటు పెరుగుతుంది. పెండ్లైన వాళ్లు పిల్లల వాళ్ల కోసం డబ్బును ఖర్చు చేస్తారు. మీ భాగస్వామితో భావోద్వేగ బ్లాక్ మెయిల్ మానితేనే బెటర్. మీ కుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే గొడవలు జరిగే ప్రమాదం ఉంది.

తుల

మితిమీరి ఆహారం తినొద్దు. రుణాల కోసం చూస్తున్నవారికి ఈ రోజు కలిసి వస్తుంది. మీ సంతానం మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే చాన్స్ ఉంది. ప్రేమ వ్యవహారాల్లో బలవంతపెట్టడం మానుకోండి. ఉమ్మడి వెంచర్లు, భాగస్వామ్య పత్రాలపై సంతకాలు చేయొద్దు. మీ అత్తామామాల నుంచి అశుభ వార్త వింటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవపడే చాన్స్ ఉంది.

వృశ్చికం

అనవసరమైన టెన్షన్ మానుకోండి. లేకపోతే అవి మీ సమస్యను మరింత ఇబ్బంది పెడతాయి. పెట్టుబడి ద్వారా పెట్టిన డబ్బు ఆర్థిక ప్రయోజనాలను కలుగజేస్తుంది. కుటుంబసభ్యుల నుంచి సహకారం అందుతుంది. ప్రశంసలు, రివార్డులు వాయిదా పడతాయి. ఆత్మ సంతృప్తి కోసం ఆలోచించండి. 

ధనుస్సు

కొన్ని మానసిక ఒత్తిడులు ఏర్పడతాయి. ధనార్జన చేస్తారు. ఈ రోజు మీ ప్రేమ అనుకోలి మలుపులు తిరుగుతుంది. మీతో వివాహానికి సిద్ధపడతారు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆఫీస్‌లో ఈ రోజు మంచి రోజుగా మిగులుతుంది. పనిలో ప్రశంసలు దక్కుతాయి.

మకరం

ఇతరులకు చెడు చేయాలని చూస్తే మానసిక ఆందోళన కలుగుతుంది. అలాంటి ఆలోచనలు మీ జీవితంపై ప్రభావం చూపుతాయి. మీ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. వ్యాపారస్థులు ధనాన్ని జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. లేకపోతే దొంగతనానికి గురవుతుంది. ప్రేమ, స్నేహ బంధం ఎదుగుతాయి. మంచి ప్రశంసలు దక్కుతాయి. 

కుంభం

పిల్లల ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరంతరం జరిగినా, రోజు చివర్లో తగిన ధనాన్ని పొదుపు చేస్తారు. ఒక శుభవార్త వింటారు. మీ ఆనందాన్ని అదుపులో ఉంచుకోండి. మీ ప్రేమకు ఈ రోజు అద్భుతమైన రోజు. పెళ్లి విషయంలోనూ ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.

మీనం

మీ జీవిత భాగస్వామి వల్ల రోజంతా హుషారుగా ఉంటారు. డబ్బు ఇబ్బందులు కుటుంబంలో అసమ్మతికి కారణం అవుతాయి. కుటుంబసభ్యుల అవసరాలు తీర్చటమే మీ ప్రాధాన్యం. కొత్త వెంచర్లు మంచి లాభాలను అందిస్తాయి. మీకు ఇష్టమైనవారు మీ ప్రేమకు పొంగిపోతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడతారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్