Daily Horoscope | ఈ రోజు రాశిఫలాలు 12 ఏప్రిల్ 2024

Rashi Phalalu | భవిష్యత్తు అంచనాకు రాశిఫలాలు ఒక ముఖ్యమైన సూచిక. రాబోయే రోజు ఎలా ఉండబోతోంది? ఏ రోజు ఏం జరుగుతుంది? అని చెప్పటానికి రాశిఫలాలు ఉపయగపడతాయి. 12 రాశుల్లో ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అన్న సమాచారం దొరుకుతుంది. దీనికి పూర్తి విశ్వసనీయత ఆయా సందర్భాలను బట్టి మారుతూ ఉంటుంది.

rashi phalalu
ప్రతీకాత్మక చిత్రం

మేషం: కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. దీర్ఘ కాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

వృషభం: ఇంటా బయట అనుకూల  పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో కుటుంబమున ఉత్సహంగా గడుపుతారు. మిత్రులతో  విహారయాత్రలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మిధునం: ఋణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి.  రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత  మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది.  నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. 

సింహం: చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగమునకొన్ని  వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు.

కన్య: ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కొన్ని పనులలో  సమస్యలు తొలగి  ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

తుల: ధన, వస్తు, వాహన లాభాలు ఉన్నవి. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో  బయట పడగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

వృశ్చికం: చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు  నిరుత్సాహంగా ఉంటాయి.

ధనస్సు: ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. దూరప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయమై  వైద్య సహాయం అవసరం అవుతుంది.

మకరం: స్థిరాస్తి లాభం కలుగుతుంది. చేపట్టిన పనులు  నిదానంగా  పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం: ముఖ్యమైన పనులలో  కావాల్సిన వారి  సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయులు నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.

మీనం: వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ  సూచనలు ఉన్నవి. ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి.

వెబ్ స్టోరీస్