Daily Horoscope | ఈ రోజు రాశి ఫలాలు 3 ఏప్రిల్ 2025

Horoscope : భవిష్యత్తు ఎలా ఉంటుందని అంచనా వేసేవే రాశి ఫలాలు. నక్షత్రాన్ని బట్టి రాశిని గుర్తించి.. ఆ రాశి వారికి జరిగే శుభాశుభాలను తెలియజేసే ఈ పద్ధతి జ్యోతిష్య శాస్త్రంలో అద్భుతమైనది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధను, మకరం, కుంభం, మీనం.. 12 రాశుల్లో ఫలితాలు ఎలా ఉంటాయని తెలియజేస్తుంది.

rashi phalalu

రాశిఫలాలు

మేషం: బంధు మిత్రుల ఆగమన ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

వృషభం: చేపట్టిన పనులలో  కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి   వ్యాపారాలు మరింత సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో  అంచనాలు  నిజమవుతాయి.  దూరపు బంధువుల నుండి ఊహించని  ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

మిధునం: 

ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు  మందగిస్తాయి.  వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి. ఉద్యోగమున  అధికారుల ఆగ్రహానికి  గురవుతారు. సంతాన ఆరోగ్య  విషయంలో సమస్యలు ఉంటాయి.

కర్కాటకం: నిరుద్యోగులకు  అనుకూల వాతావరణం ఉంటుంది.  సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యమైన పనులలో  కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనంతో  గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి. 

సింహం: ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. నూతన వాహన  కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో   సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరులతో   వివాదాలు  పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

కన్య: దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆదాయానికి మించి  ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో  ఆకస్మికంగా  నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలుంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: ఇంటా బయట  కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. కొన్ని  వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసివస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు. చేపట్టిన వ్యవహారాలు వ్యయప్రయాసలతో  కాని  పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు  నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ధనస్సు: నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో  కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. .చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు  లోటుండదు.

మకరం: ఉద్యోగాలలో మీ పనితీరకు తగిన ప్రశంసలు అందుకుంటారు.  గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కుంభం: ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. కొన్ని వివాదాలకు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. వ్యాపారమున కొత్త సమస్యలు ఉత్పన్నమౌతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం: చేపట్టిన పనులలో శ్రమపెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు చికాకు పరుస్తాయి.  దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ధన పరంగా ఇతరులకు  మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. బంధు మిత్రుల ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమౌతాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్