Daily Horoscope | ఈ రోజు రాశి ఫలాలు 29 జూన్ 2025

Horoscope : భవిష్యత్తు ఎలా ఉంటుందని అంచనా వేసేవే రాశి ఫలాలు. నక్షత్రాన్ని బట్టి రాశిని గుర్తించి.. ఆ రాశి వారికి జరిగే శుభాశుభాలను తెలియజేసే ఈ పద్ధతి జ్యోతిష్య శాస్త్రంలో అద్భుతమైనది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధను, మకరం, కుంభం, మీనం.. 12 రాశుల్లో ఫలితాలు ఎలా ఉంటాయని తెలియజేస్తుంది.

horoscope today

రాశి ఫలాలు 29.06.2025

మేషం: నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు తప్పవు. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వలన వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. 

మిధునం: కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహనం యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

సింహం: కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. 

కన్య: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదర సంబంధిత విషయమై మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. ఇంటాబయట రుణ పరమైన ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

తుల: నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలను జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.

వృశ్చికం: సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.  వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు: వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

మకరం: దూరపు బంధువుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులు చర్చలకు వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

కుంభం: ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ  నిదానంగా పూర్తిచేస్తారు.

మీనం: అవసరానికి చేతిలో డబ్బునిలువ ఉండదు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా భాధ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.  నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్