Daily Horoscope | ఈ రోజు రాశి ఫలాలు 15జులై 2025

Horoscope : భవిష్యత్తు ఎలా ఉంటుందని అంచనా వేసేవే రాశి ఫలాలు. నక్షత్రాన్ని బట్టి రాశిని గుర్తించి.. ఆ రాశి వారికి జరిగే శుభాశుభాలను తెలియజేసే ఈ పద్ధతి జ్యోతిష్య శాస్త్రంలో అద్భుతమైనది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధను, మకరం, కుంభం, మీనం.. 12 రాశుల్లో ఫలితాలు ఎలా ఉంటాయని తెలియజేస్తుంది.

horoscope

ప్రతీకాత్మక చిత్రం

మేషం: అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథాఖర్చులు పెరుగుతాయి. విద్యార్థుల ఫలితాలు  నిరుత్సాహ పరుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది.

వృషభం: రుణదాతల  నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మిధునం: ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయమై  ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం  ఉంటుంది.

కర్కాటకం: చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన ధన వస్తులాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత  ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి.. అవసరానికి ధన సహాయం అందుతుంది. ముఖ్యమైన  పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

కన్య: ఇంటా బయట  అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు  దర్శిస్తారు. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుండి  శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.  విద్యార్దులు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక  నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు.   ఉద్యోగమున  అనుకూలత పెరుగుతుంది.

వృశ్చికం: ముఖ్యమైన  పనులు వాయిదా వేస్తారు. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి.

ధనస్సు: ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో  పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు.   నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు  ఫలిస్తాయి.  వృత్తి  ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మకరం: వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన  వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కుంభం: ఆర్థిక పురోగతి సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు.  చిన్ననాటి స్నేహితులతో  సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి  శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

మీనం: ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో  కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు  అనుకున్న విధంగా రాణిస్తాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున  ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు  నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్