Horoscope | ఈ రాశి వారికి దగ్గరి వారి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

మేషం : ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మంచి ఆరోగ్యం. మీ భాగస్వామితో ప్రేమ సంగీతంలో మునిగిపోతారు. మీ వైవాహిక జీవితంలో అత్యుత్తమ రోజుగా మలుచుకొనే అవకాశం ఉంది. మీ భాగస్వామికి సహాయపడండి.

వృషభం : మీకున్న శక్తిని మంచి పనికి వినియోగించండి. సమయాన్ని వృధా చేయొద్దు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయొద్దు. వివాహబంధంలోకి అడుగుపెట్టే సమయం. మీ కుటుంబంతో కలిసి జీవితంలో ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

కర్కాటకం : కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రేమలో మీకు ఇది అదృష్టం తెచ్చే రోజు. మీ భాగస్వామి ఫాంటసీలను నిజం చేస్తారు. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.

సింహ : పని వల్ల ఒత్తిడి, విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నీరసిస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకొనేప్పుడు కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు సమస్యలను తీసుకొస్తాయి. సామరస్యంగా ఉండాలి. ధ్యానం చేస్తే ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఉపయోగకరం. 

కన్య : పన్ను నొప్పి, కడుపు సమస్యలు వంటివి ఏర్పడతాయి. దగ్గరి బంధువులతో ఆర్థిక సమస్యలు. భాగస్వామితో మాట్లాడి ఇంటి పనులను ముగించేందుకు చర్యలు తీసుకోండి. జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు.

తుల : వ్యక్తిత్వం సుగంధంలా ఉంటుంది. పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. బంధువులతో కలిసి ఉండండి. వినోదయాత్రకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. ఆర్థికంగా కలసివస్తుంది. జీవితం బాగుండేందుకు ఏం కావాలో, ఏం చేయాలో గుర్తుంచుకోవాలి.

వృశ్చికం : విశ్వాసం ఎక్కువ. విశ్రాంతి తీసుకోవటానికి సమయం దొరుకుతుంది. ఎప్పటి నుంచో చేస్తున్న పొదుపు మీకు సాయం చేస్తుంది. కాకపోతే ఖర్చులు బాధపెడతాయి. మీ సమస్యలు పెరుగుతాయి. ఇతరులు మీ వేదనను పట్టించుకోరు. అనవసర వాగ్వివాదాలకు సమయాన్ని వృధా చేస్తారు. విజయానికి క్రమశిక్షణ అవసరం.

ధనుస్సు : అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ధనార్జన చేస్తారు. మీ మాటలను కఠినంగా వాడతారు. ఈ రోజు మత సంబంధ వ్యక్తి లేదా యోగి దగ్గరకు వెళ్లే అవకాశం ఉంది. మనసుకు ప్రశాంతత, శాంతి కలుగుతాయి. ఖాళీ సమయాన్ని ఆప్తమిత్రుడితో గడుపుతారు. ఆఫీస్‌లో అన్ని అంశాలు అనుకూలంగా ఉండొచ్చు. 

మకరం : చిన్నపిల్లలతో ఆడుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గరి వారి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. రోజు చివర్లో కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు. దగ్గరివారితో వాగ్వాదం వల్ల మూడ్ చెడిపోతుంది.

కుంభం : గత వెంచర్ల నుంచి విజయం దక్కి మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ధూమపానం, మద్యపానంపై ఖర్చు మానేయండి. లేకపోతే దాని వల్ల ఆర్థిక స్థితికి దెబ్బ. మీ ప్రియమైన వారితో సమయాన్ని గడిపితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంభాషణ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

మీనం : వేరేవాళ్ల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గిస్తే తర్వాత ఆ డబ్బు పనికొస్తుంది. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవటానికి మంచి రోజు. ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు. ఆర్థికంగా కలిసివస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్