Rashi Phalalu (03-04-2023) : అకస్మాత్తు శుభవార్త వింటారు.. ఇంటిల్లిపాదికి ఆనందం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

మేషం : మీ డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఎక్కడ ఖర్చవుతుందో తెలుసుకోండి. లేకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవు. కుటుంబానికి కూడా సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి పెరుగుతుంది. మీకు, మీ జీవిత భాగస్వామికి గొడవలు తెచ్చేలా ఎవరైనా ప్రయత్నించవచ్చు. అయితే, దాన్ని మీరిద్దరు సర్దుబాటు చేసుకుంటారు.

వృషభం : భావోద్వేగం వల్ల నిలకడగా ఉండలేరు. ఇతరుల ముందు ఎలా ఉంటున్నామని ఆలోచించుకోండి. సాయంత్రం అకస్మాత్తుగా ఒక శుభవార్త అందవచ్చు. దాని వల్ల ఇంటిల్లి పాది ఆనందంలో తేలుతారు. మీరు చెప్పే కొన్ని విషయాలు మీ కుటుంబ సభ్యులకు బాధను కలిగించే చాన్స్ ఉంది.

మిథునం : ఆతృత, అతి అభిరుచులు మీ నరాల పనితీరును దెబ్బతీసే చాన్స్ ఉంది. భావోద్వేగాలను అదుపు చేసుకోండి. తల్లిదండ్రులు చెప్పే మాటలను కచ్చితంగా వినండి. దానివల్ల భవిష్యత్తు సమస్యల నుంచి గట్టెక్కుతారు. పని ఒత్తిడితో మానసిక శ్రమ కలుగుతుంది. మధ్యాహ్నం తర్వాత కాస్త విశ్రాంతి దొరుకుతుంది. ఆఫీస్‌లో మీ పని నాణ్యంగా ఉంటుంది. మీ భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో పట్టింపుగా ఉంటారు.

కర్కాటకం : ఏదో ఒక సృజనాత్మక పని చేయండి. ఖాళీగా కూర్చుంటే మీ ప్రశాంతత దెబ్బతింటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కానీ, బయటికి వెళ్లే డబ్బు మీ ప్రాజెక్టులకు అడ్డం పడుతుంది. మీకిష్టమైన వారు మీ అలవాట్లపై అసహనంతో ఉంటారు. ఈ రోజు మీ భాగస్వామితో కలిసి అద్భుతమైన సమయాన్ని గడుపుతారు.

సింహ : కంటిలో శుక్లాలు ఉండే రోగులు కలుషితమైన ప్రదేశాలకు వెళ్లవద్దు. ఆ పొగ మీ కళ్లకు చేటు కలిగిస్తుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని బాకీ వసూలు అవుతుంది. మీ జీవిత భాగస్వామి బద్ధకం మీ పనులకు ఆటంకం కలిగిస్తుంది.

కన్య : స్వార్థపూరిత స్నేహితుల వల్ల మీ ప్రశాంతతకు విఘాతం కలుగుతుంది. రియల్ ఎస్టేట్‌కు మంచి రోజు. పనిలో అంకితభావాన్ని చూపండి, మంచి ఫలితాలు అందుకుంటారు. గొడవ జరిగితే పరుషమైన వ్యాఖ్యలు చేయొద్దు.

తుల : మానసిక ప్రశాంతత కలుగుతుంది. వినోదం, ఆటవిడుపులతో సేద తీరుతారు. ఈ రోజు డబ్బు బాగా ఖర్చు పెడతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రేమలోని బాధను అనుభవించే చాన్స్ ఉంది. మితిమీరిన కోరికలు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీసే చాన్స్ ఉంది.

వృశ్చికం : ఆరోగ్యం బాగుంటుంది. మీ మానసిక స్థితి మంచి శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది. కొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి, ధనం ప్రవాహిస్తుంది. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఒంటరిగా మిగిలిపోతారు. సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం అందుతుంది.

ధనుస్సు : జీవితం మొత్తం నాదేనని గర్వంతో ఉండకండి. మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానుకోండి. మీ కొత్త పథకాలు, వెంచర్లపై మీ భాగస్వాములు ఉత్సుకత ప్రదర్శిస్తారు. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు.

మకరం : మీకున్న సునిశిత, చురుకైన మేధస్సుతో కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు. అవాస్తవమైన ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్త వహించండి. ప్రేమ, స్నేహం తదితర బంధాలు పెరుగుతాయి. వాగ్దానం చేసేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్వేగానికి లోనవుతారు. పాత విషయంపై మీ భాగస్వామితో గొడవపడతారు.

కుంభం : ధనార్జన చేస్తారు. వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయొద్దు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పనిని ఈ రోజు దక్కించుకుంటారు. ఎవరినైనా కలవాలనుకుంటే ప్లాన్ వర్కౌట్ కాకపోయే చాన్స్ ఉంది.

మీనం : గాలిలో మేడలు కట్టాలన్న ఆలోచనతో సమయాన్ని వృథా చేయొద్దు. మీ శక్తిని మంచివాటిని ఉపయోగించటానికి దాచుకోండి. అవసరమైన డబ్బు లేకపోవడం వల్ల కుటుంబంలో అసమ్మతికి కారణం అవుతుంది. ఆలోచించి కుటుంబసభ్యులతో మాట్లాడి సలహాలు తీసుకోండి. ఉన్నతాధికారుల ముందు జాగ్రత్తగా వ్యవహరించండి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్