Daily Horoscope | ఈ రోజు రాశిఫలాలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

మేషం

ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహకారంతో తీరే అవకాశం ఉంది. మీరు చేసే సహాయం ఒకరి జీవితాన్ని కాపాడుతుంది. ఈ వార్త మీ కుటుంబసభ్యులు గర్వించేలా చేస్తుంది. కొత్త వెంచర్లు లాభాలను ఇస్తాయి. మీ వైవాహిక జీవితంలో అన్నీ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. 

అదృష్ట సంఖ్య : 7, అదృష్ట రంగు : లేత తెలుపు, తెలుపు

వృషభం

ఈ రోజు మీ శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు. డబ్బు పొదుపు చేస్తారు. ప్రేమ, స్నేహం ధృడం అవుతాయి. ఆఫీస్‌లో మీరు చేసే పనికి మీ పై అధికారి ఇంప్రెస్ అవుతారు. ఆధ్మాత్మిక పుస్తకాల పఠనం సమస్యలను తొలగిస్తుంది.

అదృష్ట సంఖ్య : 6, అదృష్ట రంగు : పారదర్శక, చంద్రిక

మిథునం

ఆర్థిక అభివృద్ధిపై మీ జీవిత భాగస్వామితో కలిసి ఆలోచనలు చేస్తారు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వెంచర్లు మొదలుపెట్టడం కలిసివస్తుంది. మీ ప్రేమ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. 

అదృష్ట సంఖ్య : 4, అదృష్ట రంగు : గోధుమ, బూడిద

కర్కాటకం

నిగ్రహ శక్తి చాలా అవసరం. లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. డబ్బు వినియోగంపై పద్ధతి పాటిస్తారు. మీ ఫాంటసీలు ఈ రోజు నిజం అయ్యే అవకాశాలున్నాయి. ఎప్పుడో మొదలుపెట్టిన పనిని పూర్తి చేస్తారు. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య అభిప్రాయభేదాలు రావొచ్చు జాగ్రత్త.

అదృష్ట సంఖ్య : 8, అదృష్ట రంగు : నలుపు, నీలం

సింహ

ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రియమైన వారు అలగకుండా చూసుకోండి. వ్యాపారంలో మెలకువలు నేర్చుకోండి. లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు.

అదృష్ట సంఖ్య : 6, అదృష్ట రంగు : పారదర్శక, చంద్రిక

కన్య

చురుకైన మేథాశక్తితో కొత్త విషయాలను నేర్చుకుంటారు. రియల్ ఎస్టేట్‌లో మదుపు చేస్తే లాభం. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. ఉద్యోగంలో మార్పు మానసిక సంతృప్తి కలిగిస్తుంది. వైవాహిక జీవితానికి సంబంధించిన వాస్తవాలు మీ కళ్లముందు కనిపించి ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

అదృష్ట సంఖ్య : 4, అదృష్ట రంగు : గోధుమ, బూడిద

తుల

రక్తపోటు ఉంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో, ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శిస్తే ఆర్థికంగా నష్టపోతారు. మీకు ఇష్టమైన వారి నుంచి కానుకలు, బహుమతులు అందుకుంటారు. మీ చుట్టూ ఉన్న సమస్యల పరిష్కారానికి మీ పరపతి వాడాల్సిన అవసరం ఉంది. మీ జీవితభాగస్వామి నిజమైన ఏంజెల్.

అదృష్ట సంఖ్య : 7, అదృష్ట రంగు : లేత తెలుపు, తెలుపు

వృశ్చికం

ఆరోగ్యం బాగుంటుంది. మానసిక స్థితి బాగుంటుంది. ధనం చేతికి అంది ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశం ఉంది. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది.

అదృష్ట సంఖ్య : 9, అదృష్ట రంగు : ఎరుపు, పసను

ధనుస్సు

ఆరోగ్యం జాగ్రత్త. అందుకోసం ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇవ్వండి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. పిల్లలు చేదోడువాదోడుగా నిలుస్తారు. మీ ప్రియమైనవారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీ అభిప్రాయాలు చెప్పి లబ్ధి పొందుతారు. మీ అంకిత భావానికి మెప్పు పొందుతారు. మీ ప్రియమైన వారు హగ్, ముద్దు అడిగితే ఇచ్చేయండి. లేకపోతే వారు బాధపడతారు.

అదృష్ట సంఖ్య : 6, అదృష్ట రంగు : పారదర్శక, చంద్రిక

మకరం

పిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుత ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకరిని కలుసుకుంటారు.. వారితో మీ ఆర్థిక స్థితి ధృడంగా మారుతుంది. మీ స్నేహితుడిని చాలా రోజుల తర్వాత కలుస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మీ భాగస్వామితో ప్రేమలో తడిసి ముద్దవుతారు.

అదృష్ట సంఖ్య : 6, అదృష్ట రంగు : పారదర్శక, చంద్రిక

కుంభం 

ధ్యానం, యోగా చేయండి. ఆర్థిక లబ్ధి తెచ్చే పరిస్థితి కలుగుతుంది. అహాన్ని పక్కనబెట్టి మీ సమస్యలను కుటుంబ సభ్యులకు చెప్పండి. సమస్యలు తీరే అవకాశం ఉన్నాయి. మీ తోటి సిబ్బంది మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ జీవితభాగస్వామి మీ ప్రేమలో పడిపోతారు.

అదృష్ట సంఖ్య : 3, అదృష్ట రంగు : కాషాయం, పసుపు

మీనం

ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి. ఇంటి కోసం డబ్బు దాచుకుంటే లాభం. మీ కుటుంబసభ్యులతో సమయం గడపండి. అనుకోని మెసేజ్ మీకు అందమైన కలను తెస్తుంది. మీలా అలోచించే స్నేహితుల సహకారం తీసుకోండి. ఈ రోజు ఆనందంగా ఉంటారు. మీ పాత వస్తువులు దొరుకుతాయి. వైవాహిక జీవితం వినోదం, ఆనందంగా ఉంటుంది.

అదృష్ట సంఖ్య : 1, అదృష్ట రంగు : ఆరెంజ్, బంగారం


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్