Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..ఈ తేదీల్లో దర్శనాలు రద్దు

తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. అక్టోబర్ 3 నుంచి 12 వరకు తొమ్మిది రోజులపాటు శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ttd

ప్రతీకాత్మక చిత్రం 

తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. అక్టోబర్ 3 నుంచి 12 వరకు తొమ్మిది రోజులపాటు శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున భక్తులు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు నేపథ్యంలో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు ప్రత్యేక దర్శనాలను, ఆర్జిత సేవలను, బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ  తెలిపింది. 

తిరుమలలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ న సాయంత్రం నిర్వహించే అంకురార్పణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 4 తేదీ సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనం సేవ నిర్వహిస్తారు. 5 తేదీ ఉదయం చిన్న శేష వాహనం, మధ్యాహ్నం స్నపనం, రాత్రి హంస వాహన సేవ జరుగుతుంది. 6 తేదీ ఉదయం సింహ వాహనంపై విహరించనున్న శ్రీవారు.. రాత్రి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. 7తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు.

8 తేదీ మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు అభయప్రదానం చేస్తారు.  9వ తేదీ ఉదయం హనుమంత వాహనంపై విహరించనున్న శ్రీవారు.. రాత్రి గజ వాహనంపై సాక్షాత్కరిస్తారు. 10వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. అక్టోబర్ 11వ తేదీ ఉదయం రథోత్సవం జరుగుందని.. రాత్రి అశ్వవాహన సేవ ఉంటుందని తెలిపింది. 12వ తేదీ ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి నిర్వహించే ద్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్