ఆడవారికి నెలసరి సమస్య వచ్చినప్పుడు దేవున్ని పూజించలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఏ విధంగా పూజ చేయవచ్చు? ఇంట్లో ఎవరు పూజ చేయవచ్చు? దీపం ఎవరు పెట్టాలి?
ప్రతీకాత్మక చిత్రం
హిందూ సంప్రదాయం ప్రకారం నిత్య దీపారాధన చేయడం చాలా మంది మహిళలకు అలవాటు. అయితే దీపారాధన చేయాలన్నా, దేవుడిని పూజించాలన్నా కూడా మనం ఎంతో పరమ పవిత్రంగా, శుభ్రంగా దేవుడి గదిలోకి వెళ్లి దేవున్ని పూజించి దీపారాధన చేయాలి. కానీ ఆడవారికి నెలసరి సమస్య వచ్చినప్పుడు దేవున్ని పూజించలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఏ విధంగా పూజ చేయవచ్చు? ఇంట్లో ఎవరు పూజ చేయవచ్చు? దీపం ఎవరు పెట్టాలి? అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే నెలసరి సమయంలో 5వ రోజు దీపారాధన చేయవచ్చా అనే సందేశం చాలా మంది మహిళల్లో ఉంటుంది. అది ఏంటో తెలుసుకుందాం. ఆడవాళ్లు నెలసరి సమయంలో పూజ గదిలో 5వ రోజు దీపం పెట్టరాదు. ఎందుకంటే 5వ రోజు సంపూర్ణ స్నానం అవుతుంది. ఆ సంపూర్ణ స్నానం అయిన రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం పీరియడ్స్ సమయంలో అన్ని ముట్టుకుంటాం కాబట్టి. ఇల్లును పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ మరుసటి రోజు అంటే 6వ రోజు మాత్రమే దీపారాధన చేయాలి. లేదు ఇంట్లో రోజు దీపం వెలిగించాలి అని అనుకునేవారు వాళ్ల మగవారితో (భర్త) దీపం పెట్టవచ్చు. కానీ నెలసరి ఉన్న స్త్రీ మాత్రం 5 రోజులు ఎట్టిపరిస్థితుల్లో దీపం పెట్టకూడదు.