మారేడు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చా.. దీని ఉపయోగాలు ఏంటంటే..

పరమ శివుడికి ఎంతో ఇష్టమైన పవిత్ర వృక్షం మారేడు. దీన్ని బిల్వ వృక్షం అని కూడా అంటారు. ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న మారేడు వృక్షంలో మీకు తెలియని ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు మారేడు చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా?

maredu tree

ప్రతీకాత్మక చిత్రం 

పరమ శివుడికి ఎంతో ఇష్టమైన పవిత్ర వృక్షం మారేడు. దీన్ని బిల్వ వృక్షం అని కూడా అంటారు. ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న మారేడు వృక్షంలో మీకు తెలియని ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు మారేడు చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా? మారేడు పండు తింటే ఏమవుతుంది ? మారేడు ఆకులు తినవచ్చా? తదితర ఎన్నో విలువైన విషయాలను తెలుసుకుందాం. మారేడు చెట్టు హిందువులకు ఎంతో పవిత్రమైన చెట్టు. ఈ చెట్టు మహాశివుడికి ఎంతో ఇష్టమైన చెట్టు. శివుడికి మారేడు పత్రాలతో పూజిస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు అని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ చెట్లను ఉపయోగించి అనేక వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన చెట్టు ఈ మారేడు చెట్టు. అయితే మారేడు చెట్టుకి ముళ్లు ఉంటాయి. ముళ్ల చెట్టును ఇంట్లో ఉంచుకుంటే కీడు అంటారు పెద్దలు. కానీ మారేడు చెట్టు వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మారేడు వేరు త్రిదోషాలను నయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మారేడు పండు తియ్యగా ఉంటుంది. మారేడు ఆకుల రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో రెండు పుటలా గోరువెచ్చని నీటితో తీసుకుంటే వాతం, తెమడ, పిత్త దోషాలు, మలబద్దకం, కామెర్ల వ్యాధులు కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. హిందువులు మారేడు చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. పూర్వకాలం నుంచి కూడా మారేడు చెట్టు ప్రాచుర్యంలో ఉంది.

మారేడు ఆకులు మూడు కలిసి ఒకే ఈనెలో ఉంటాయి. ఆ ఆకు పరమశివుడి మూడు కన్నులుగా సూచిస్తాయి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం అని చదువుతాం. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ చెట్టు కిందే నివాసం ఉంటాడు అని భక్తుల విశ్వాసం. అదేవిధంగా వృక్షాలు పువ్వులు పూసి కాయలు కాస్తాయి కానీ, మారేడు చెట్టు మాత్రం పువ్వు లేకుండానే కాయలు కాస్తుంది. మనం పువ్వులతో దేవునికి పూజ చేసేటప్పుడు తొడిమెలు తేకుండా పూజ చేస్తాం కానీ, మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు మాత్రం కచ్చితంగా తొడిమెలు ఉండాలి. మారేడు దళానికి ఉన్న ఈనె.. శివలింగానికి తాకినప్పుడు మన ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది అంటారు. లక్ష్మీ స్థానాలు ఐదు అని శాస్త్రం చెప్తోంది. అందులో మారేడు దళం ఒకటి. శివుడిని మారేడు దళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. బాల్యం, యవ్వనం, కౌమారాన్ని చూస్తావని ఆశీర్వదిస్తాడట. అంటే.. ఆయుర్దాయం పూర్తిగా ఉంటుందని అర్థం. 

శివుడికి ఎంతో ఇష్టమైన ఈ మారేడు చెట్టును ఇంట్లో ఉంచుకోవచ్చు. వాస్తవానికి ఏ రకమైన ముళ్ల చెట్టు అయినా ఇంట్లో ఉంటే దాని ద్వారా దోషాలు కలుగుతాయి. అయితే ముళ్ల చెట్టును దేవుడి పూజ కోసం ఉపయోస్తే కచ్చితంగా పెంచుకోవచ్చు. దానికి ఎటువంటి దోషాలు ఉండవు. మారేడు ఆకును ప్రతిరోజు పూజలో ఉపయోగిస్తే మీ ఇంట్లో మారేడు చెట్టును పెంచుకోవచ్చు. మారేడు చెట్టును ఇంట్లో పెంచేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. ఎందుకు అంటే అది చాలా పవిత్రమైనది కాబట్టి. పెంచేటప్పుడే కాదు కోసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. మారేడు చెట్టు ఆకులను బుధ, శనివారాలలో మాత్రమే కోయాలి. మారేడు చెట్టుకు మిగతా చెట్లకు ఎంతో తేడా ఉంటుంది. మారేడుకి మిగతా చెట్లకంటే ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. మారేడు చెట్టు ముళ్లు ఉండే చెట్టు కాబట్టి ఇంటి ముందు భాగంలో కాకుండా ఇంటి వెనకాల పెంచుకోవచ్చు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్