ఆషాడం వచ్చేసింది...బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. నెలరోజుల పాటు భాగ్యనగరంలో పల్లె వాతావరణం తలపిస్తుంది. ఆషాడం మాసం తొలి ఆదివారం ఈ ఏడాది జులై 7 నుంచి ప్రారంభం అవుతుంది. మొదటిసారిగా గోల్కొండలోని జగదాంబకి అమ్మవారికి బంగారం బోనంతో సందడి మొదలౌవుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
ఆషాడం వచ్చేసింది...బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. నెలరోజుల పాటు భాగ్యనగరంలో పల్లె వాతావరణం తలపిస్తుంది. ఆషాడం మాసం తొలి ఆదివారం ఈ ఏడాది జులై 7 నుంచి ప్రారంభం అవుతుంది. మొదటిసారిగా గోల్కొండలోని జగదాంబకి అమ్మవారికి బంగారం బోనంతో సందడి మొదలౌవుతుంది. ఎక్కడ చూసిన వేపకొమ్మలు, వేపాకు తోరణాలతో ప్రతి గల్లీలో బోనాల జాతర షురూ అవుతుంది. ఈ నెల రోజులు హైదరాబాద్ లోని అమ్మవారి గుళ్లు అందంగా ముస్తాబు అవుతాయి. అమ్మవారి పాటలు, భజనలతో నగర ప్రజలు పులకిస్తారు. గల్లీ నుంచి గోల్కొండ వరకు పాతబస్తీ నుంచి లష్కర్ వరకు అమ్మవారి గుళ్లన్నీ భక్తులతో పోటెత్తుతాయి.
భాగ్యనగరంలో ప్రతి ఏటా మొదటి బోనం గోల్కొండలోని జగదాంబకి అమ్మవారికి సమర్పించడంతో బోనాల పండగ మొదలౌతుంది. ఒక్కప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరిలో బోనాలు పండగను ఘనంగా జరుపుకునేవారు. అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరపున బోనాల సంబురాలు జులై 7న ప్రారంభం అవుతున్నాయి. ముందుగా జగదాంబి అమ్మవారికి ఆదివారం బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
కాగా గోల్కొండ బోనాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుంచి కోటలో బోనాలు జాతర జరుగుతుందని చరిత్ర చెబుతోంది. కాకతీయుల నుంచి రాజ్యం కుతుబ్షాహి చేతుల్లోకి వచ్చిన తర్వా త కూడా ఈ జాతర కొనసాగింది. ప్రతి సంవత్సరం ఆషాడ మాసం మొదటి గురువారం లేదా మొదటి ఆదివారంలో ఇక్కడ బోనాలెత్తుత్తారు. గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదాంబకి తల్లికి ఇష్టమైన బోనం పటేల్ ఇంటి నుంచి వస్తుంది. పటేలోళ్లదే మొదటి బోనం. వాళ్లు బోనం పెట్టుడుతోనే జాతర ప్రారంభం అవుతుంది. వాళ్లు మొదటి బోనం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.