||సెప్టెంబర్ 18న వినాయక చవితి||
వినాయక చవితి ఉత్సవాలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. గణేశ్ చతుర్థి ఎప్పుడన్న విషయంపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 18వ తేదీనే వినాయక చవితి పండుగను నిర్వహించాలని పేర్కొంటూ కీలక ప్రకటన చేసింది. అంతకుముందు 19వ తేదీన వినాయక చవితి, 29న నిమజ్జనం ఉంటుందని కమిటీ ప్రకటించినా, తాజాగా కొత్త తేదీని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. నిమజ్జనం 28వ తేదీన ఉంటుందని వెల్లడించింది. ఈ ఏడాది తిథి రెండు రోజులు ఉండటం వల్ల వినాయక చవితి ఎప్పుడనే దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, శృంగేరి - కంచి పీఠాధిపతులు విఘ్నేశ్వరుడి ప్రతిష్ఠ 18వ తేదీనే చేసుకోవాలని సూచించారని, ఆ నేపథ్యంలో తేదీని 18కి మార్చినట్లు వివరించింది.