Raksha Bandhan | రాఖీ కట్టే సమయాలివే.. ఆ సమయంలో రాఖీ కడితే సోదరులకు అరిష్టాలే..

Raksha Bandhan | అన్నాచెల్లెలి, అక్కాతమ్ముల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక. అన్నాదమ్ములు దీర్ఘాయువుతో జీవించాలని కోరుకుంటూ తోబుట్టువులు రాఖీ కడతారు.

raksha bandhan 2024

ప్రతీకాత్మక చిత్రం

అన్నాచెల్లెలి, అక్కాతమ్ముల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక. అన్నాదమ్ములు దీర్ఘాయువుతో జీవించాలని కోరుకుంటూ తోబుట్టువులు రాఖీ కడతారు. ప్రతి శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజునే రాఖీ పౌర్ణమిగా చెప్తాం. ఈ ఏడాది ఆగస్టు 19 (సోమవారం)న రాఖీ పండుగ వచ్చింది. వాస్తవానికి సమయాలు చూడకుండానే చాలా మంది సోదరీమణులు.. తమ అన్నాదమ్ములకు రాఖీలు కడతారు. అయితే, ఈ ఏడాది మాత్రం ముహూర్తం చూసుకొనే రాఖీ కట్టాలని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ ఏడాది రాఖీ పండుగ సందర్భంగా భద్ర కాలం దాపురిస్తున్నది. ఈ భద్ర కాలంలో రాఖీ కడితే అన్నాదమ్ములకు చెడు జరుగుతుందని నిపుణుల వాదన. ఉదయం 5:53 గంటలకు ప్రారంభమయ్యే భద్రకాలం.. మధ్యాహ్నం 1:32 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదని చెప్తున్నారు. ఈ భద్రకాలం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1: 43 గంటల నుంచి రాత్రి వరకు రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం అని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు.

ఎవరీ భద్ర.. ఎందుకు ఆ సమయంలో రాఖీ కట్టకూడదంటే..

శనిదేవుని సోదరి భద్ర అని పురాణాలు చెప్తున్నాయి. భద్ర సమయం వచ్చినప్పుడు ఏ శుభ కార్యం చేసినా అశుభం కలుగుతుందని బ్రహ్మదేవుడి నుంచి శాపం ఉంది. అందుకే రాఖీ పౌర్ణమి రోజున భద్ర కాలంలో రాఖీ కట్టకూడదట. ఈ భద్ర కాలంలోనే రావణాసురుడికి అతడి సోదరి రాఖీ కట్టడంతో అదే సంవత్సరంలో రాముడి చేతిలో లంకాధిపతి హతమయ్యాడు. అందుకే ఆ సమయంలో రాఖీ కట్టవద్దట.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్