పొరపాటున కూడా ఈ వస్తువులను ఇంట్లో ఉంచకూడదు

వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వస్తువులు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచడానికి సహాయపడుతుంది.

vastu tips

ప్రతీకాత్మక చిత్రం 

తెలిసో తెలియకో కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుతుంటాం. అయితే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వస్తువులు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచడానికి సహాయపడుతుంది.అంతేకాదు ఇంట్లో కలహాలు, కుటుంబ పెద్దకు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వంటివి తలెత్తుంటాయి. వాస్తు ప్రకారం ఎలాంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

-వంటగదిలో పనికిరాని వస్తువులు ఉంచకూడదు. పలిగిన, లేదా సగం విరిగిన గాజు లేదా ఏదైనా ఇతర గృహోపకరణాలు ఇంట్లో ఉంచకూడదు. ఈ వస్తువులను ఇంట్లో ఎక్కువసేపు ఉంచితే, కుటుంబ సభ్యులకు అశాంతి, నిరాశ మొదలైనవి కలుగుతాయి. కాబట్టి ఈ విషయాలు వెంటనే ఇంట్లో నుంచి తీసివేయడం మంచిది 

-ఓడ ప్రమాదాలు, యుద్ధాలు, పిల్లలు ఏడుపు, సూర్యాస్తమయాలు పెయింటింగ్స్ ఇంట్లో ఉండటం మంచిది కాదు. అదేవిధంగా పడకగదిలో నది, ఫౌంటెన్, సముద్రం, వర్షం, అక్వేరియం వంటి వాటికి సంబంధించిన పెయింటింగ్ లేదా చిత్రాన్ని ఉంచడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. 

-ఏనుగు దంతాలతో చేసిన విగ్రహం, పులి చర్మం, జంతువుల కొమ్ము వంటివి ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది.

-అదే విధంగా, ఎండిన పువ్వులను చాలా కాలం పాటు జాడీలో ఉంచడం వల్ల ఇంటికి ప్రమాదం, కుటుంబ సభ్యుల మనస్సు భారమవుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్