మనం పడుకునే మంచం విషయంలో కచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చాలా మందికి తెలియవుజ మనం పడుకునే మంచం పట్ల కూడా మన అదృష్టం ఆధారపడి ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం
మనం పడుకునే మంచం విషయంలో కచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చాలా మందికి తెలియవుజ మనం పడుకునే మంచం పట్ల కూడా మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైన సరే మనం పడుకునే మంచం సరిగ్గా గుమ్మానికి ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. అలా కాకుండా తప్పనిసరి పరిస్థితిలో గుమ్మానికి ఎదురుగా మంచం వస్తే ఒక కర్టెన్ వేసుకోవాలి. బాత్రూమ్‌కు ఎదురుగా మంచం వస్తే అలాంటి సమయంలో బాత్రూమ్ డోర్ తెరిచి ఉంచకూడదు. ఈ నియమాలు తప్పనిసరి పాటించాలి. అంతేకాకుండా చాలా మంది మంచాన్ని గోడకు ఆనించి పెడుతారు. అది చాలా తప్పు. ఎప్పుడు కూడా మంచానికి నాలుగు దిక్కులా ఖాళీ స్థలం ఉండాలి. మంచానికి నాలుగు దిక్కులా ఖాళీ ఉంటేనే ప్రాణ శక్తి సరిగ్గా ఉంటుంది. అదృష్ట లక్ష్మీ అనుగ్రహం దక్కుతుంది. ఇలా కాకుండా మంచాన్ని గోడకు అనిస్తే ప్రాణ శక్తి తగ్గుతుంది.
ఈ మధ్య స్టోరేజ్ కోసం మంచానికి ర్యాక్స్ అనేవి అమర్చుకుంటున్నారు. ఆ ర్యాక్స్‌లో అనవసరపు వస్తువులను ఉంచకూడదు. అలా ఉంచితే అదృష్ట లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. చాలా మంది మంచం కింద కూడా పనికిరాని వస్తువులను ఉంచుతారు. పాత సూట్‌కేసులు, పాత సామాను, బొమ్మలు ఇలా పనికిరానివన్నీ మంచం కింద ఉంచుతారు. అలాంటివి మంచం కింద ఉన్న కూడా ప్రాణ శక్తి తగ్గిపోతుంది, అదృష్ట లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. కాబట్టి మంచం విషయంలో కచ్చితంగా ఈ నియమాలను పాటించాలి.