వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో చింత చెట్టు నాటవచ్చా?పండితులు ఏం చెబుతున్నారు

వాస్తు ప్రకారం మన ఇంటి ఆవరణలో ఎలాంటి చెట్లు నాటాలి ఎలాంటి చెట్లు నాటకూడదు వంటి వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వివరాలు తెలుసుకుందాం.

 tramanda tree

ప్రతీకాత్మక చిత్రం 

మన శరీరానికి ఆయుర్వేదం ఎలాగో మన ఇంటికి వాస్తు శాస్త్రం అలాంటిది అని పురాణాలు చెబుతున్నాయి. పాండవులు సైతం వాస్తు నియమాలను అనుసరించే  తమ రాజధాని హస్తినాపురాన్ని నిర్మించారు.ఆ హస్తినాపూరమే నేటికీ  న్యూఢిల్లీ గా మారి మన దేశానికి రాజధాని అయింది. వాస్తు నియమాలు అనుసరించారు… కాబట్టే ఢిల్లీ నగరం వేల సంవత్సరాలుగా దేశ రాజధానిగా  కొనసాగుతోంది.మన ఇంటి నిర్మాణంలో కూడా వాస్తు అనేది తప్పనిసరి అని చెప్పవచ్చు.వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో మీ జీవితం సాఫీగా సాగిపోతుంది అని  శాస్త్రం చెబుతోంది.ఈ నేపథ్యంలో వాస్తు ప్రకారం మన ఇంటి ఆవరణలో ఎలాంటి చెట్లు నాటాలి ఎలాంటి చెట్లు నాటకూడదు వంటి వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం  ఈ వివరాలు తెలుసుకుందాం.  

ఈ మొక్కలను ఇంటి ఆవరణలో  నాటవద్దు:

తుమ్మ చెట్టు : 

తుమ్మ చెట్టుకు ముళ్ళు ఉంటాయి. ముళ్ళతో కూడిన మొక్కలను వాస్తు ప్రకారం అశుభమైనదిగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో తుమ్మ మొక్క ఉంటే జీవితంలో అపశ్రుతులు ఏర్పడతాయి. వివాదాలకు దారి తీస్తుంది. మీ ఆదాయంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

చింత చెట్టు: 

వాస్తు ప్రకారం, చింతపండు ఇంటి లోపల నాటకూడదు.ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివిటీ పెరుగుతుంది. మీ ఇంట్లో చింతచెట్టు మొలిస్తే వెంటనే తీసేయండి. రోడ్డు పక్కన కానీ, ఊరి చివర ఖాళీ స్థలంలో కానీ చింతచెట్టును నాటితే మంచిది. 

పాలు కారే మొక్కలు:

ఆకు లేదా కాండం చిదిమినప్పుడు పాల పదార్థం బయటకు వచ్చే మొక్కలను ఇంట్లో ఉంచకూడదు. ఇది ఇంట్లో నెగిటివిటీని సృష్టిస్తుంది. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇది నిరంతరం వివాదాలను సృష్టిస్తుంది. ఇది మీ ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచకూడదు. 

పత్తి మొక్క:

పత్తి మొక్క వాస్తు ప్రకారం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే వెంటనే తీసేయండి.

బ్రహ్మ జెముడు :

ఈ మధ్య కాలంలో చాలా మంది ముళ్ల జాతికి చెందిన కాక్టస్ లాంటి మొక్కలను ఇంటి లోపల, బాల్కనీలు, డాబాలపై పెంచుతున్నారు. ఈ మొక్క అందంగా కనిపించినప్పటికీ, వాస్తు ప్రకారం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. దీనితో పాటు, ఇంట్లో గులాబీ మొక్కలను నాటడం కూడా అశుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే గులాబీ మొక్కలకు ముళ్ళు ఉంటాయి. వాస్తు రీత్యా ముళ్ల జాతికి చెందిన మొక్కలు అశుభం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్