శాస్త్ర ప్రకారం దంపతులు కలిసిన తరువాత మరుసటి రోజున తలస్నానం చేయాలా, పక్క బట్టలు మార్చుకోవాలా, దీనికి శాస్త్రం ఏం చెబుతుంది. చేస్తే శుభమా..లేదా అశుభమా.
ప్రతీకాత్మక చిత్రం
దంపతులు శృంగారం చేసిన తరువాత మరుసటి రోజు తలస్నానం చేయాలా? పక్క బట్టలు మార్చుకోవాలా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి శాస్త్రం ఏం చెబుతోంది? స్నానం చేస్తే శుభమా..లేదా అశుభమా? నిత్య పూజ చేసుకునే వారు ఉంటారు. వారానికి రెండు, మూడు సార్లు పూజ చేసుకునేవాళ్ళు ఉంటారు. నిత్య పూజ చూసుకునే వారు భార్యాభర్తల కలయిక తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలా? రోజూ తలస్నానం చేయాలంటే అది ఆరోగ్యానికి దెబ్బ కదా అని చాలామంది అనుకుంటే ఉంటారు అనే విషయాలను చూద్దాం.
భార్యభర్తల కలయిక అనేది సృష్టికే ఎంతో పవిత్రమైన కార్యం, సృష్టికి మూలం. అలాంటిది పరమ పవిత్రమైన కార్యాన్ని చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. ఆడవారు శరీరానికి స్నానం చేస్తే సరిపోతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే భార్యాభర్తలు కలిసిన తర్వాత ఆ పక్క బట్టలను తీసేసి, శుద్ధిగా స్నానం చేయాలి. స్త్రీ, పురుషుడు కలయిక అయినా, కాకున్నా కచ్చితంగా పక్కబట్టలు రోజూ మార్చుకోవాలి. అలా చేయడం కుదరనప్పుడు దంపతులు కలిసిన తర్వాత పక్కబట్టలు మార్చుకోవాలి.
స్త్రీకి ప్రతిరోజు తలస్నానం చేయాలి అని శాస్త్రం చెప్పలేదు. పురుషుడు మాత్రం నిత్య తలస్నానం చేయాలని చెప్పింది శాస్త్రం. ఆడవారి నుదుటిమీద గంగాదేవి కొలువై ఉంటుంది కనుక ముఖం దగ్గర నుంచి స్నానం చేస్తే సరిపోతుంది. స్త్రీ ఋతు క్రమం అయిన తర్వాత ఐదవ రోజున స్త్రీ, పురుషులు కలవాలి అని శాస్త్రం చెబుతుంది. కలవకపోతే దోషంగా చెబుతుంది శాస్త్రం. నూటికి నూరు శాతం ఐదవ రోజున కలవాలి. ఇలా కలవడం వల్ల వంశాభివృద్ధికి తోడ్పడుతుంది.