బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలు చెప్పారు. వాటిల్లో చాలా వరకు నిజం అయ్యాయి. అందుకే అయన కాలజ్ఞానం ప్రపంచమంతా ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూర్ జిల్లా బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటూ, రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు.
ప్రతీకాత్మక చిత్రం
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలు చెప్పారు. వాటిల్లో చాలా వరకు నిజం అయ్యాయి. అందుకే అయన కాలజ్ఞానం ప్రపంచమంతా ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూర్ జిల్లా బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటూ, రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గిరిగీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూచి భయపడి పరుగు పరుగున, అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చేరవేస్తారు. మరుసటి రోజున యథావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిరి గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్య పోతుంది అచ్చమ్మ. బ్రహ్మం గారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ, పుట్టు గుడ్డివాడైన తన కొడుకు బ్రహ్మానందరెడ్డికి చూపు ప్రసాదించాలని ప్రార్థిస్తుంది. బ్రహ్మం గారు తన దివ్య దృష్టితో, బ్రహ్మానందరెడ్డి గత జన్మ పాపాలను దర్శించి, అతనికి చూపు ప్రసాదించి, పాప నివృత్తి గావించారు. గుహలో కూర్చుని రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నాయి.
కాలజ్ఞానం వ్రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లయ్యపల్లె చేరి వడ్రంగి వృత్తిచేస్తూ గడిపాడు. తనవద్దకు వచ్చినవారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించాడు. అయితే 2025వ సంవత్సరంలో అనేకమైన మార్పులు ప్రకృతిలో, మానవునిలో జరగబోతున్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం 2025వ సంవత్సరంలో జరిగే నిజాల గురించి తెలుసుకుందాం. తిరుపతి వేంకటేశ్వరుని ఆలయంలోకి మొసళ్లు ప్రవేశించి 3 రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సొమ్మును దొంగలు అపహరిస్తారని కుడా రాసారు. గరుడ ద్వజంలో ఓంకార నాధం పుడుతుంది. తిరులవురి శ్రీ వీరనాగవ స్వామికి చెమటలు పడుతాయని కూడా కాలజ్ఞానంలో ఉంది. ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుంది. బియ్యం కొనలేని పేదవాళ్లు ఆకలితో చనిపోతారని, ఆకలి చావులు పెరుగుతాయని ఆయన రాశారు.
అంతేకాదు.. రాబోయే భవిష్యత్తులో జరిగే పలు సంఘటనలను కూడా బ్రహ్మం గారు వెల్లడించారు. ‘2025 తర్వాత బ్రహ్మంగారి మాటానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది. ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో ఉరుములు, మెరుపులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు. బంగారం ధర లక్షకు చేరుతుంది. అలాగే ఇత్తడి కూడా రేటు బాగా పలుకుతుంది. కృష్ణా నది బెజవాడ అమ్మవారి ముక్కుపుడుకను అందుకుంటుంది. చెన్నకేశవ స్వామి మహిమలు తగ్గుతాయి. కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది.. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్లు కనిపించవు. కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది’ అని తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే కొన్ని జరిగాయి. కొన్ని జరుగుతున్నాయి.. భవిష్యత్తులోనూ జరుగుతాయేమో..!