సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం ఈ మధ్యకాలంలో ట్రెండింగ్‌గా మారింది. అదే ప్రయత్నంలో ఓ మహిళ మృతి చెందిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సరోగసీ ద్వారా పిల్లలను కనేందుకు కొందరు ఒడిశాకు చెందిన పేద మహిళలను టార్గెట్ చేసుకుంటున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం ఈ మధ్యకాలంలో ట్రెండింగ్‌గా మారింది. అదే ప్రయత్నంలో ఓ మహిళ మృతి చెందిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సరోగసీ ద్వారా పిల్లలను కనేందుకు కొందరు ఒడిశాకు చెందిన పేద మహిళలను టార్గెట్ చేసుకుంటున్నారు. వాళ్లను అక్కడి నుంచి తీసుకొచ్చి డీల్ కుదుర్చుకుంటున్నారు. తాజాగా, హైదరాబాద్‌కు చెందిన రాజేశ్ బాబు.. ఒడిశాకు చెందిన అశ్విత సింగ్ అనే మహిళతో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమెను ఒడిశా నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోం భుజలో ఉన్న తన ప్లాట్‌లో ఉంచుకున్నాడు.
అయితే, సరోగసీ ద్వారా పిల్లలను కంటామని నమ్మబలికిన రాజేశ్ బాబు.. ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అతడిబారి నుంచి తప్పించుకొనేందుకు శతవిధాలా ప్రయత్నించింది. రూమ్‌లోనే బంధించి నరకం చూపించడంతో తీవ్ర ఇబ్బందులు పడింది. అయితే.. ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. తనను బంధించిన 9 ఫ్లోర్ నుంచి కిందికి చీర సహాయంతో దిగాలని చూసింది. అయితే, ఆరో అంతస్థు వద్ద అదుపు తప్పి కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది.