మొగుడితో పాటు ప్రియుడు కూడా కావాలట.. వివాహిత వింత కోరిక

ఆమెకు పెళ్లై భర్త, పిల్లలు ఉన్నారు.. అయినా వేరో వ్యక్తితో ప్రేమలో పడి అతన్నీ కావాలంటోంది. తనకు భర్త కావాలి.. ప్రియుడు కూడా కావాలి అని ఏకంగా విద్యుత్తు స్తంభం ఎక్కి నిరసన తెలిపింది. ఏంచక్కా ముగ్గురం.. పిల్లలతో కలిసి జీవిద్దాం అంటూ మంకు పెట్టుకొని కూర్చుంది.

gorakhpur
ప్రతీకాత్మక చిత్రం Photo: Facebook

ఈవార్తలు, క్రైం న్యూస్: ఆమెకు పెళ్లై భర్త, పిల్లలు ఉన్నారు.. అయినా వేరో వ్యక్తితో ప్రేమలో పడి అతన్నీ కావాలంటోంది. తనకు భర్త కావాలి.. ప్రియుడు కూడా కావాలి అని ఏకంగా విద్యుత్తు స్తంభం ఎక్కి నిరసన తెలిపింది. ఏంచక్కా ముగ్గురం.. పిల్లలతో కలిసి జీవిద్దాం అంటూ మంకు పెట్టుకొని కూర్చుంది. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో విజరిగింది. వివరాల్లోకి వెళితే.. పెండ్లయ్యి భర్త, పిల్లలున్న ఓ వివాహిత మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఎంత చెప్పినా తన ప్రియుడిని వదులుకోనని  తెగేసి చెప్పింది. భర్త ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో దగ్గరల్లోని విద్యుత్తు స్తంభంపైకి ఎక్కి నిరసన తెలిపింది.

ప్రియుడు కూడా తమతోపాటే ఉంటే ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయని భర్తకు, భర్త బంధువులకు సలహా ఇస్తోంది. అయినా ఒప్పుకోకపోవటంతో ఆ వివాహిత విద్యుత్తు స్తంభంపైకి ఎక్కింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారు విద్యుత్తు సరఫరా నిలిపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను బలవంతంగా కిందకు దింపేశారు.

వెబ్ స్టోరీస్