వాట్సాప్‌ (Whatsapp)లో మరో కొత్త ఫీచర్.. తప్పు మెసేజ్ పంపానని బాధ పడాల్సిన అవసరం లేదిక

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, టెక్ న్యూస్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అయ్యింది. మనం పంపే మెసేజ్‌లలో తప్పులు ఉంటే సరి చేసుకొనే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఎవరికైనా మెసేజ్ పంపితే, దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం లేదు. కానీ, వినియోగదారుల సౌకర్యం కోసం ఎడిట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

మనం మెసేజ్ పంపిన 15 నిమిషాల్లోపు వాట్సాప్‌‌లో ఎడిట్ ఆప్షన్‌ క్లిక్ చేసి, ఆ సందేశాన్ని ఎడిట్ చేయొచ్చు. పంపిన మెసేజ్‌‌ను క్లిక్ చేసి, హోల్డ్ చేస్తే కాపీ, ఎడిట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఎడిట్ ఆప్షన్‌ను ఎంచుకొని మార్పు చేయొచ్చు. ఎడిట్ చేసిన ఆ మెసేజ్ కింద ఎడిటెడ్ అని కనిపిస్తుంది. అదేవిధంగా అంతర్జాతీయ కాల్స్ బెడద ఉండకుండా, మరో ఫీచర్ కూడా అందుబాటులోకి తెచ్చేలా వాట్సాప్ చర్యలు తీసుకుంటోంది.

వెబ్ స్టోరీస్