11000కు చేరిన టర్కీ సిరియా మృతుల సంఖ్య.. 40 వేల మందికి గాయాలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| భూకంపం ధాటికి కుప్పకూలిన ఇళ్లు ||

టర్కీ, సిరియాలో అతిపెద్ద భూకంపంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మృతుల సంఖ్య 11000 కి చేరుకుంది. 40 వేల మందికి పైగా ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సహాయక చర్యల వల్ల మృతి చెందిన వారిని బయటకు తీసే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య 20వేలకు చేరే అవకాశం ఉందన్న డబ్ల్యూహెచ్‌వో అంచనా దాటనుందా.. రెండు దేశాల్లో ఇప్పటికే 435 సార్లు భూమి పంపించినట్లు టర్కీ విపత్తు నివారణ విభాగం వెల్లడించింది. ఈ విపత్తులో దాదాపు 3.80 లక్షల మంది ఇళ్లను కోల్పోయి నిరాశకు లోనయ్యారు. ప్రస్తుతం వీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లు, షాపింగ్మాల్లు, మైదానాలు, ఇతర కమ్యూనిటీ కేంద్రాల్లో రక్షణ పొందుతున్నారు. గత రెండు రోజులుగా 25 వేలమంది సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. శిథిలావస్థలో పడి ఉన్న భవనాల నుండి ప్రాణాలు కోల్పోయిన వారి శవాలు లభ్యమవుతూనే ఉన్నాయి. రాత్రి, పగలు చలిలో టార్చ్ లైట్లతో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. విపత్తులో మొత్తం 80 వేల మంది చిక్కుకున్నారని అంచనాలు వేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్