సోషల్ మీడియా ద్వారా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తుంటారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ముఖ్యంగా షేర్ ట్రేడింగ్, బెట్టింగ్, నకిలీ వెబ్‌సైట్లపై ప్రజలకు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తుంటారు. అయితే, తాజాగా ఆయన బైక్ రైడర్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా ద్వారా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తుంటారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ముఖ్యంగా షేర్ ట్రేడింగ్, బెట్టింగ్, నకిలీ వెబ్‌సైట్లపై ప్రజలకు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తుంటారు. అయితే, తాజాగా ఆయన బైక్ రైడర్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కెమెరా కొనేందుకు ట్రేడింగ్‌ను అనుసరించడం.. దాన్ని ప్రమోట్ చేయడంపై సజ్జనార్ తప్పుబట్టారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!! అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!! ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి!!? ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి’ అని ప్రజలకు సూచించారు.
చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!! అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!! ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి!!? ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా… pic.twitter.com/rFiOeYVzl7
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 24, 2025