ముంబై రైల్వేస్టేషన్లో తొక్కిసిలాట.. పలువురు ప్రయాణికులకు గాయాలు

ముంబై రైల్వేస్టేషన్ లో ఆదివారం ఉదయం తొక్కిసిలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బాంద్రా టెర్మినల్ కు భారీగా ప్రయాణికులు తరలివచ్చారు. దీపావళి, ఛత్ పూజ సందర్భంగా ప్రజలు సొంతూర్లకు వెళ్లేందుకు ఈ స్టేషన్ కు తరలివచ్చారు. భారీగా ప్రయాణికులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది.

Passengers injured in stampede

తొక్కిసలాటలో గాయపడిన ప్రయాణికులు

ముంబై రైల్వేస్టేషన్ లో ఆదివారం ఉదయం తొక్కిసిలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బాంద్రా టెర్మినల్ కు భారీగా ప్రయాణికులు తరలివచ్చారు. దీపావళి, ఛత్ పూజ సందర్భంగా ప్రజలు సొంతూర్లకు వెళ్లేందుకు ఈ స్టేషన్ కు తరలివచ్చారు. భారీగా ప్రయాణికులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో తొమ్మిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బాంద్రా టెర్మినస్ బాంద్రా (ఇ) ప్లాట్ ఫామ్ నెంబర్ ఒకటిపై చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులు ఆరోగ్యం నిలకడగా అనే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే వీరందరినీ దగ్గరలోని ఒక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కూడా అదుపు చేయలేనంత స్థాయిలో జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన ఆదివారం ఉదయం తెల్లవారుజామున 2.25 గంటల సమయంలో జరిగినట్లు చెబుతున్నారు. బాంద్రా గోరఖ్ పూర్ ఎక్స్ప్రెస్ రైలు ముంబై రైల్వే స్టేషన్ కు చేరుకోగానే ప్రయాణికులు అందులో ఎక్కేందుకు పోటెత్తారు. ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడడంతో ఈ తొక్కిసిలాట చోటుచేసుకుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్