నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన నుంచి బాలుడి కిడ్నాప్

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. జిల్లాలోని మాక్లూర్ మండలం మానిక్ భండార్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం దవాఖానకు తీసుకొచ్చాడు.

nizamabad hospital
నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన

నిజామాబాద్, ఈవార్తలు : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. జిల్లాలోని మాక్లూర్ మండలం మానిక్ భండార్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం దవాఖానకు తీసుకొచ్చాడు. రాత్రి సమయంలో తన మూడేళ్ల బాలుడితో కలిసి దవాఖానలోని కారిడార్‌లో పడుకున్నారు. తండ్రి గాఢ నిద్రలో ఉండగా, గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లారు. కాసేపటికి నిద్రలేచిన తండ్రి.. తన పక్కన కొడుకు కనిపించకపోయే సరికి దవాఖాన అంతటా వెతికాడు. ఎక్కడా కనిపించక పోవటంతో దవాఖానలో డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు.

వెంటనే ఒకటో టౌన్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. దవాఖానలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, ఇద్దరు వ్యక్తులు బాలుడిని ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. బాలుడిని ఎటువైపు తీసుకువెళ్లారన్న విషయాన్ని తెలుసుకోవడానికి దవాఖాన పరిసరాల్లో, బస్టాండ్, పట్టణంలోని పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్