||ప్రతీకాత్మక చిత్రం||ఈవార్తలు, నల్లగొండ: హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు శివారులోని ఎరసాని గూడెం వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌కు తరలించారు. మృతుల్లో ఎండీ ఇద్దాక్ (21), ఎస్కే సమీర్ (21), ఎస్కే యాసీన్ (18) ఉన్నారు. వీరంతా ఖమ్మం వాసులు అని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని వలీమా ఫంక్షన్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఇన్నోవా కారు బోల్తా పడిందని పోలీసులు పేర్కొన్నారు.