బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమ (Hema) అరెస్టయ్యింది. గత నెలలో బెంగళూరులోని ఓ ఫాంహౌజ్‌లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో హేమకు పరీక్షలు నిర్వహించగా, డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.
సినీ నటి హేమ Photo: facebook
ఈవార్తలు, బెంగళూరు : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమ (Hema) అరెస్టయ్యింది. గత నెలలో బెంగళూరులోని ఓ ఫాంహౌజ్‌లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో హేమకు పరీక్షలు నిర్వహించగా, డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసు జారీ చేశారు. హేమ హాజరు కాకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. అయినా, ఆమె హాజరుకాకపోవడంతో ఆమెను అరెస్టు చేశారు. కాగా, ఈ రేవ్ పార్టీ కేసులో పలువురు తెలుగు నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. అయితే, తాను ఆ పార్టీలో లేనని, తప్పుడు వార్త ప్రచారం చేశారని హేమ ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. ఆమెపై మరో కేసు కూడా నమోదు చేశారు. కాగా, పార్టీలో డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. ఇందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలకు పాజిటివ్ వచ్చింది. ఇందులో హేమ కూడా ఉంది.