నవీన్ హత్య కేసులో నిహారిక రెడ్డి, హాసన్ అరెస్టు.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, క్రైం న్యూస్: అబ్దుల్లాపూర్‌మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసులో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో హరిహర కృష్ణ ప్రియురాలు నిహారిక రెడ్డి, స్నేహితుడు హాసన్ పోలీసులు దర్యాప్తు చేసి వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 17న జరిగిన నవీన్ కేసులో వీరి పాత్ర కూడా కీలకంగా ఉందని ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ వెల్లడించారు. ఫిబ్రవరి 17న నవీన్ హత్య కేసులో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ ఫిబ్రవరి 24న హరిహరకృష్ణ లొంగిపోయాడు. హరిహర కృష్ణ లొంగిపోయినప్పుడు ఈ హత్యలో తానొక్కడే పాత్ర ఉందని ఇంకెవరూ లేరని మొబైల్ డేటాను తొలగించి పోలీసులకు లొంగిపోయాడు. కానీ పోలీసుల దర్యాప్తులో హత్య కేసులో నిహారిక, హాసన్ కూడా కీలక పాత్ర పోషించారని వెళ్లడైంది.

దర్యాప్తులో ఈ హత్య తన ప్రియురాలు నిహారిక కోసమే చేశాడని వెళ్లడైంది. ఈ హత్య జరిగిన తర్వాత ఘటన స్థలానికి హరిహర, నిహారిక, హసన్‌ ముగ్గురు వెళ్లారు. తన ప్రియుడు హరిహరకు నిహారిక రెడ్డి రూ.1500 ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఎలాంటి ఆధారాలు దొరకకుండా మొబైల్ డేటాను డిలీట్ చేసి ఎవిడెన్స్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు కేసులో ఏ1 గా హరిహర కృష్ణ, ఏ2 గా హసన్, ఏ3గా నిహారికగా కేసు నమోదు చేశారు.  ఇద్దరు నిందితులకు హయత్నగర్ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిహారికను చంచల్ గూడ జైలుకు, హసన్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్