తెలంగాణలో వికారాబాద్ జిల్లా కలెక్టర ప్రతీక్‌జైన్‌పై దాడి ఘటనలో ఏ2 నిందితుడు లగచర్లకు చెందిన సురేశ్ లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు మంగళవారం పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు.
లగచర్ల ప్రధాన నిందితుడు సురేశ్ (ఇన్‌సెట్‌లో)
తెలంగాణలో వికారాబాద్ జిల్లా కలెక్టర ప్రతీక్‌జైన్‌పై దాడి ఘటనలో ఏ2 నిందితుడు లగచర్లకు చెందిన సురేశ్ లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు మంగళవారం పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. దీంతో అతడిని పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరు పర్చగా, రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. లగచర్ల ఘటనలో సురేశ్.. గిరిజనులను ఉసిగొల్పాడని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కలెక్టర్ బృందాన్ని ప్రజాభిప్రేయ సేకరణ వేదిక వద్ద నుంచి ఊరిలోకి తీసుకెళ్లడంలో సురేశ్ కీలకంగా వ్యవహరించాడు. అక్కడికి వెళ్లగానే ఆందోళనకారులు నినాదాలు చేస్తూ దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే రైతులను సురేశ్ రెచ్చగొట్టి ఉంటాడని పేర్కొంటూ ఏ2గా చేర్చారు.
కాగా, లగచర్ల అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి చేరింది. ఈ అంశాన్ని రాష్ట్రపతికి వివరించేందుకు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరారు. దీంతో లగచర్లలో గిరిజనులపై అణచివేత సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరారు. దీంతో బలవంతపు భూసేకరణ, పోలీసుల దాడులు, లైంగిక దాడి వంటి అంశాలను బీఆర్ఎస్ నేతలు అందజేశారు. మరోవైపు, లగచర్లలో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులపై ఎస్టీ, ఎస్సీ మహిళా మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన బాధితులు రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.