ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసులో అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది.

ktr

కేటీఆర్

హైదరాబాద్, ఈవార్తలు : ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసులో అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ముందుగా కేటీఆర్‌ను విచారించి, ఆ తర్వాత అధికారులను విచారించే అవకాశం ఉంది. ఈ కేసు వ్యవహారంలో ఏసీబీ పెట్టింది తప్పుడు కేసు అని.. దాన్ని క్వాష్ చేయాలన్న కేటీఆర్ అభ్యర్థనపై హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. అటు.. ఈడీ కూడా అరవింద్ కుమార్ బీఎల్ఎన్ రెడ్డిని విచారణకు రావాలని పిలిచిన సంగతి తెలిసిందే. 8, 9 తేదీల్లో హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నెల  న కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్