కేటీఆర్ లీం టీమ్‌ను విచారణకు అనుమతించే ప్రసక్తే లేదని తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో స్పష్టం చేసింది. విచారణకు సహకరించాలని హైకోర్టు.. కేటీఆర్‌కు స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో ఆయనను మరోసారి విచారణకు పిలవనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఏసీబీ కార్యాలయం
హైదరాబాద్, ఈవార్తలు : కేటీఆర్ లీం టీమ్‌ను విచారణకు అనుమతించే ప్రసక్తే లేదని తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో స్పష్టం చేసింది. విచారణకు సహకరించాలని హైకోర్టు.. కేటీఆర్‌కు స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో ఆయనను మరోసారి విచారణకు పిలవనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రెండోసారి విచారణకు వచ్చేప్పుడు లీగల్ టీంను తీసుకొని రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. కాసేపట్లో కేటీఆర్‌కు మరో నోటీస్ అందజేస్తామని వివరించారు. కాగా.. ఈ రోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ తన లీగల్ టీమ్‌తో కలిసి ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు. కానీ.. లీగల్ టీంను లోపలికి అనుమతించబోమని పోలీసులు తెలిపారు. దీంతో.. తాను లీగల్ టీంను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతానని స్పష్టం చేసిన కేటీఆర్.. వెనక్కి వెళ్లిపోయారు.
మరోవైపు, ఈ కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మరో విషయాన్ని బయటపెట్టింది. ఫార్ములా-ఈ కారు రేస్‌లో భాగస్వామిగా ఉన్న గ్రీన్ కో నుంచి బీఆర్‌ఎస్‌కు భారీగా ఎలక్టోరల్ బాండ్లు వెళ్లినట్లు పేర్కొంది. 2022 ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 10 మధ్య గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు బీఆర్ఎస్ కోసం భారీగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. మొత్తంగా 41 సార్లు.. ప్రతి సారి రూ.కోటి విలువ చేసే బాండ్లు వెళ్లినట్లు వివరించింది. మొత్తం మీద రూ.41 కోట్ల మేర బీఆర్ఎస్‌కు ఎన్నికల బాండ్ల రూపంలో చెల్లింపులు జరిగాయని పేర్కొంది.