యాదాద్రిజిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన గుంటిపల్లి సౌమ్య (25) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతూ, పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటోంది.
రోడ్డు ప్రమాదంలో గుంటిపల్లి సౌమ్య మృతి
ఈవార్తలు, యాదగిరిగుట్ట: మంచి జాబ్ కొట్టాలి.. లైఫ్‌లో సెటిల్ అవ్వాలన్న లక్ష్యంతో కన్నోళ్లను విడిచిపెట్టి, ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లి కష్టపడి చదువుకొంటున్న ఎంతోమంది విద్యార్థుల జీవితాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. హత్యకు గురవటం, ఉగ్రదాడుల్లో మృతిచెందటం, రోడ్డు ప్రమాదాల్లో చనిపోవటం లాంటి ఘటనలు తల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతున్నాయి. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు భారీగా పెరిగాయి. తాజాగా, ఆదివారం రాత్రి న్యూయార్క్‌లో ఓ తెలుగు బిడ్డ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. యాదాద్రిజిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన గుంటిపల్లి సౌమ్య (25) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతూ, పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటోంది. అయితే, ఆదివారం రాత్రి రోడ్డుపై నడుచుకొంటూ వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సౌమ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సౌమ్య మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.