(ప్రతీకాత్మక చిత్రం)
ఈవార్తలు, మంచిర్యాల: తెలంగాణలోని మంచిర్యాలలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అగ్నికి ఆహుతి అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి 1:30 గంటలకు అగ్ని ప్రమాదం చోటుచేసుకొంది. ఆ సమయంలో అందరు నిద్రిస్తున్నారు. దీంతో ఆ అగ్నికి వారంతా ఆహుతి అయ్యారు. మృతుడు మాసు శివయ్య (50) గ్రామంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
అగ్ని ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేసిన రామగుండం డిప్యూటీ కమిషనర్ అఖిల్ మహాజన్.. ఘటనాస్థలికి క్లూస్ టీమ్‌ను రప్పించి, ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించినట్టు ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.